ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల్లో డిబేట్లకు ఎందుకంత ప్రాముఖ్యం?

author img

By

Published : Oct 12, 2020, 4:38 PM IST

అమెరికన్​ అధ్యక్ష ఎన్నికల డిబేట్​.... అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షిస్తున్న అంశం ఇదే. విభిన్న విషయాలపై అభ్యర్థుల ఆలోచనలు, అభిప్రాయాలు, కార్యాచరణ ప్రణాళికలు పంచుకునే వేదికలుగా ఈ సంవాదాలు పనిచేస్తాయి. ప్రస్తుతం 2020 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఒక డిబేట్​ ముగియగా.. మరో డిబేట్​ రద్దయింది. అసలు ఈ డిబేట్లకు ఎన్నికల పర్వంలో ఇంత ప్రాధాన్యం దేనికి ? అధ్యక్షుడిని నిర్ణయించటంతో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ?

presidential debates
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డిబేట్లకు ఎందుకంత ప్రాముఖ్యత?

అమెరికా ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగాల్సిన రెండో సంవాదం రద్దయింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగాల్సిన చర్చ ఉండదని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్​(సీపీడీ) ప్రకటించింది.

అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడు ముఖాముఖి చర్చలు జరగాలి. ఇప్పటికే ఒకటి ముగియగా.. అక్టోబర్ 15, అక్టోబర్ 22 తేదీల్లో మిగతా రెండు డిబేట్​లు నిర్వహించాలని ప్రణాళికలు వేశారు. రెండో డిబేట్ రద్దు కావడం వల్ల.. ఇరువురి మధ్య తుది​ సంవాదం మాత్రమే జరగనుంది. దీంతో సంవాదం ప్రాముఖ్యం మరోసారి చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: ట్రంప్​కు కరోనా తగ్గకపోతే డిబేట్ వద్దు: బైడెన్

సంవాదం అవసరం

అమెరికా అధ్యక్ష ఎన్నికల క్రతువులో... కీలక ఘట్టంగా పరిగణించే సంవాదాలు దేశ అధ్యక్షుడిని నిర్ణయించటంలో చాలా అవసరమని భావిస్తారు అమెరికన్లు. ప్రస్తుతం డిబేట్ల ఫలితాలు ఎలా ఉన్నా.. జరగటం మాత్రం అనివార్యమనే చర్చ ఉంది. అందుకే, అధ్యక్షుడు ట్రంప్​ కరోనా బారిన పడిన తర్వాత వర్చువల్​గానైనా సంవాదం నిర్వహించేందుకే చివరి వరకూ ప్రయత్నించారు నిర్వాహకులు.

ఇదీ చూడండి: ట్రంప్, బైడెన్ మధ్య రెండో డిబేట్​ రద్దు

debates
సంవాదాల షెడ్యూల్​

మొట్టమొదటి డిబేట్

ఎన్నికల్లో భాగంగా మారిపోయిన డిబేట్లకు ఘనమైన చరిత్రే ఉంది. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల చరిత్రలో మొట్టమొదటి డిబేట్​... 1960 సెప్టెంబర్​ 26న జరిగింది. షికాగో వేదికగా జరిగిన నాటి చర్చలో అప్పటి సెనేటర్​ జాన్​ ఎఫ్​ కెనెడీ, ఉపాధ్యక్షుడు రిచర్డ్​ నిక్సన్​ పాల్గొన్నారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ డిబేట్ అమెరికన్​ అధ్యక్ష ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది. ఆ ఏడాది కెనెడీ-నిక్సన్​ నాలుగు సార్లు డిబేట్​లో పాల్గొన్నారు. అయితే ఈ డిబేట్​ టెలివిజన్ స్టుడియో​ వేదికగానే జరిగింది. అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాల నుంచే సంవాదంలో పాల్గొన్నారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజలు తమ టీవీ సెట్లలో వీక్షించారు.

అంతకుముందే..

అయితే, కెనెడీ-నిక్సన్​ కంటే ముందే.. 1956లో స్టీవెన్​సన్​, ఐసెన్​హోవర్​ మధ్య డిబేట్ జరిగినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా వీరిరువురు పాల్గొనకుండా వీరి ప్రతినిధులను రంగంలోకి దించారు. విదేశాంగ విధానం గురించి.. ఎలక్షన్ డేకు రెండు రోజుల ముందే చర్చ జరిగింది. అప్పటి నుంచి డిబేట్లు అధ్యక్ష ఎన్నికల్లో అంతర్భాగంగా మారినట్లు చెబుతున్నారు. అయితే, సంవాదాల్లో వీరు చర్చించే అంశాలు వారి భవిష్యత్తు నిర్ణయించటంలో కీలకంగా మారుతాయి.

ప్రస్తుత ఎన్నికల్లో మొదటి సంవాదంలో భాగంగా.. ట్రంప్​-బైడెన్​, సుప్రీం కోర్టు, కొవిడ్​-19, ఆర్థిక వ్యవస్థ, జాత్యాంహకారం-నగరాల్లో హింస, ఎన్నికల పారదర్శకత వంటి అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ నేతల తీరు భయానకంగా ఉందన్న వ్యాఖ్యలూ వినిపించాయి.

ఇదీ చూడండి: 'ఎలా ఉన్నావ్?' నుంచి 'నోరు మూస్తావా' వరకు...

ఇదీ చూడండి: ట్రంప్​ X బైడెన్​: వాడీవేడిగా తొలి డిబేట్​

సంవాదాలు-అంశాలు

ఈ చర్చలన్నీ కమిషన్​ ఆఫ్​ ప్రెసిడెంట్​ డిబేట్స్​.. సీడీపీ నిర్వహిస్తుంటుంది. 1987లో ఏర్పాటైన కమిషన్.. ఈ పార్టీలతో సంబంధంలేని స్వచ్ఛంద సంస్థ. దశాబ్దాలుగా అమెరికన్​ అధ్యక్ష, ఉపాధ్యక్షుల చర్చలు నిర్వహిస్తోంది. అయితే, సంస్థ ఏర్పాటుకు ముందు చర్చలపై అభ్యర్థుల ఏకాభిప్రాయానికి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనేవారు.

అమెరికా చర్చల చరిత్ర

  1. 1960- ఆ ఎన్నికల్లో 4 సంవాదాలు నిర్వహించారు. ఉపాధ్యక్ష డిబేట్​ లేదు. షికాగోలో నిర్వహించిన ఈ సంవాదంలో కెనెడీ-నిక్సన్​ ప్రధానంగా దేశంలోని నాటి అంతర్గత సమస్యలపై చర్చించారు.
  2. 1976- ఈ ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో డిబేట్లు ప్రారంభమయ్యాయి. 3 సంవాదాల్లో అభ్యర్థులు పాల్గొన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్​ సైతం జరిగింది. ఈ సంవాదాల్లో చర్చనీయ అంశాలుగా విదేశాంగ, రక్షణ సమస్యలు, అలాగే దేశీయ సమస్యలు ఉన్నాయి.
  3. 1980- ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య రెండు సంవాదాలు జరిగాయి. జిమ్మీ కార్టర్​-రొనాల్డ్​ రీగన్​ పాల్గొన్న ఈ డిబేట్లను 8కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. అంశాలుగా ఆర్థిక సమస్యలు, విదేశాంగ విధానం, జాతీయ భద్రత వంటివి ఉన్నాయి.
  4. 1992- ఈ ఎన్నికల నుంచి మూడు అధ్యక్ష సంవాదాలు, ఒక ఉపాధ్యక్ష డిబేట్​ ఒరవడి ప్రారంభమైంది. బిల్​ క్లింటన్​, జార్జి బుష్ మరో స్వతంత్ర అభ్యర్థి రోస్​ పెరోట్​ మధ్య సంవాదం జరిగింది. విస్తృతమైన అంశాలపై కూలంకషంగా చర్చించారు.
  5. 1996- ఈ ఏడాది సంవాదంలో రెండు అధ్యక్ష సంవాదాలు, ఒక ఉపాధ్యక్ష డిబేట్ జరిగింది. అభ్యర్థులుగా బిల్​ క్లింటన్​-బాబ్​ డోలే పాల్గొన్నారు. ఇద్దరు నేతలు విభిన్న అంశాలపై ఒకరిపై మరొకరు ప్రశ్నలు సంధించుకున్నారు .
  6. 2000- ఈ ఎన్నికల్లో 4 సంవాదాలు జరిగాయి. అధ్యక్ష అభ్యర్థులు మూడింటిలో, ఉపాధ్యక్ష అభ్యర్థులు ఒక్కదాంట్లో పాల్గొన్నారు. అధ్యక్ష అభ్యర్థులుగా జార్జి వాషింగ్టన్​ బుష్​, అల్ గొరే తలపడ్డారు. విభిన్న అంశాలపై వ్యాఖ్యాత సంధించే ప్రశ్నలకు ఇరువురు అభ్యర్థులు 2 నిమిషాలకు మించకుండా జవాబు చెప్పేలా నిర్వహించారు.
  7. 2004- ఈసారి కూడా 4 డిబేట్లు జరిగాయి. నాడు అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్​ బుష్​ను సవాల్​ చేసిన జాన్​ ఎఫ్​ కెర్రీ.. విదేశాంగ విధానం, జాతీయ భద్రత వంటి అంశాలపై సంవాదం జరిపారు.
  8. 2008- ఈ ఏడాది డిబేట్​లో మూడు సార్లు జరగగా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్​లో బరాక్​ ఒబామా.. జాన్​ మెక్ ​కెయిన్ తలపడ్డారు. ఉపాధ్యక్ష సంవాదంలో జో బైడెన్​ పాల్గొన్నారు. నాడు ప్రధాన అంశాలుగా విదేశాంగ విధానం, జాతీయ భద్రతతో పాటు ఆర్థిక మాంద్యం నిలిచింది.
  9. 2012- ఈ ఎన్నికల్లో బరాక్​ ఒబామాతో రిపబ్లికన్​ అభ్యర్థి మిట్​ రోమ్నీ తలపడ్డారు. ఉపాధ్యక్ష అభ్యర్థిల డిబేట్​ జో బైడెన్​- పాల్​ రయాన్​ మధ్య నిర్వహించారు. ప్రజలు ఇంటర్నెట్​ ద్వారా అడిగిన ప్రశ్నలను అభ్యర్థులకు సంధించారు.
  10. 2016- ఈ ఏడాది సంవాదం డొనాల్డ్​ ట్రంప్​-హిల్లరీ క్లింటన్​ మధ్య జరిగింది. దాదాపు 8.4 కోట్ల మంది వీక్షించారు. దేశ శ్రేయస్సు కోసం తీసుకోబోయే నిర్ణయాలు, అమెరికా భవిష్యత్తు, దేశ భద్రత వంటి అంశాలపై సంవాదం జరిగింది.

ఓటర్లు ప్రభావితం

అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ డిబేట్లను కీలకంగా భావిస్తుంటారు అమెరికన్లు. ఈ చర్చల్లో నాయకుల ఆలోచనలు, అభిప్రాయాలు ఓటర్లను ప్రభావితం చేస్తుంటాయి. గతంలో ఎన్నికలు ముగిసిన అనంతరం నిర్వహించిన సర్వేల్లోనూ డిబేట్ల ఆధారంగానే ఓట్లు వేశామని ప్రజలు చెప్పిన సందర్భాలున్నాయి. అయితే, అన్నిసార్లు డిబేట్లే ప్రమాణికంగా ఓట్లేయరు. అభ్యర్థులపై అనుమానం ఉన్నప్పుడే ఈ సంవాదాలపై ప్రజలు దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ నేపథ్యంలోనే 2012 డిబేట్​ను 5కోట్ల మంది వీక్షిస్తే.. 2016కు అది 8 కోట్లు దాటింది. అయితే, ప్రజలను తమవైపు తిప్పుకోవటానికి నాయకులకు సైతం సంవాదాలను సరైన మార్గంగా చూస్తుంటారు. అందుకే అమెరికన్​ అధ్యక్ష ఎన్నికల క్రతువులో డిబేట్లకు ఎనలేని ప్రాధాన్యం.

ఇదీ చూడండి: తొలి డిబేట్ గెలిచింది నేనే: ట్రంప్

ఇదీ చూడండి: 'బైడెన్​ గెలిస్తే నెలలోపే కమ్యూనిస్ట్​ కమల అధికారం చేపడతారు'

ఇదీ చూడండి: 'ట్రంప్​ హై తో సేఫ్​ హై' ప్రచారానికి భారతీయ-అమెరికన్​ శ్రీకారం

ఇదీ చూడండి: 'శ్వేతసౌధంలో కరోనా విజృంభణకు ఆ సమావేశమే కారణం'

ఇదీ చూడండి: కరోనా వచ్చినా నిర్లక్ష్యంగానే ట్రంప్: బైడెన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.