ETV Bharat / international

కరోనా బోనస్​: ఒక్కో ఫ్యామిలీకి ఫ్రీగా రూ.2.25లక్షలు!

author img

By

Published : Mar 20, 2020, 10:58 AM IST

Updated : Mar 21, 2020, 11:01 AM IST

కరోనా వైరస్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికన్లకు ట్రంప్​ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైరస్​పై పోరుకు ఇప్పటికే 1 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆంక్షల​ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడకుండా.. కుటుంబంలోని పెద్దలకు వెయ్యి డాలర్లు, చిన్నారులకు 500 డాలర్ల నగదు అందించడానికి ప్రణాళికలు రచిస్తోంది.

us-plans-cash-transfer-of-1000-dollars-per-adult-500-dollars-per-child
కరోనా బోనస్​: ఒక్కో ఫ్యామిలీకి ఫ్రీగా రూ.2.25లక్షలు!

కరోనా బోనస్​: ఒక్కో ఫ్యామిలీకి ఫ్రీగా రూ.2.25లక్షలు!

అమెరికా ప్రజలను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. వైరస్​ రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా.. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కుటుంబంలోని పెద్దలకు 1000 డాలర్లు, చిన్నారులకు 500 డాలర్ల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

కరోనాపై పోరుకు ఇప్పటికే 1 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు ట్రంప్​. ఈ నగదు బదిలీ ప్రక్రియ కూడా ప్యాకేజీలో భాగమేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్​ నుచిన్​ వెల్లడించారు. దీని మొత్తం వ్యయం 500 బిలియన్​ డాలర్లుగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

"కుటుంబంలో నలుగురు ఉంటే.. వారికి 3వేల డాలర్లు అందుతాయి. కాంగ్రెస్​ దీనికి ఆమోదం తెలిపిన మూడు వారాల్లో ఇది అమలవుతుంది. ఆరు వారాల తర్వాత కూడా దేశంలో జాతీయ విపత్తు పరిస్థితులు కొనసాగితే.. మరో 3వేల డాలర్లు అందిస్తాము. నిత్యం శ్రమించే ఎందరో అమెరికన్లు.. వాళ్ల తప్పేమీ లేకున్నా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నిధులు వారి కోసమే."

--- స్టీవెన్​ నుచిన్​, అమెరికా మంత్రి

ఈ ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీలోని 300 బిలియన్​ డాలర్లను చిన్న వ్యాపారాల మనుగడకు, మరో 200 బిలియన్​ డాలర్లను ఎయిర్​లైన్స్​తో పాటు ఇతర రంగాలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేశారు స్టీవెన్​ నుచిన్​.

200 దాటిన మృతుల సంఖ్య..

అమెరికాలో కరోనా వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. మొత్తం 218మంది వైరస్​తో మృతిచెందారు. మరో 14వేల మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

కాలిఫోర్నియాలో...

అమెరికాలో వైరస్​ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. ఫలితంగా ఆ రాష్ట్ర ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది ప్రభుత్వం. నిత్యావసరాలు, అత్యవసర పరిస్థితులు మినహా.. ప్రజలు దేనికోసమూ బయటకు రాకూడదని స్పష్టం చేసింది.

దాదాపు 39 మిలియన్​ మందికి నివాసం కాలిఫోర్నియా. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18మంది వైరస్​ సోకి మరణించారు. అయితే ఈ ఆంక్షలు ఎప్పటివరకు ఉంటాయనే విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం అక్కడి వారిని తీవ్రంగా కలవరపెడుతోంది.

ఇదీ చూడండి:- కరోనాను రెండో రోజూ డకౌట్​ చేసిన చైనా

Last Updated : Mar 21, 2020, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.