ETV Bharat / international

అమెరికాలో 2.6లక్షల కేసులు.. వణుకుతున్న ప్రపంచ దేశాలు

author img

By

Published : Dec 24, 2021, 11:01 AM IST

Updated : Dec 24, 2021, 12:01 PM IST

US covid surge: ఒమిక్రాన్​ భయపెడుతున్న వేళ అమెరికాలో కొవిడ్​ కేసులు మరోమారు 2లక్షలు దాటాయి. అటు బ్రిటన్​లోనూ కేసుల సంఖ్య పెరిగింది. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచదేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి.

US covid cases
అమెరికాలో మళ్లీ 2లక్షల కేసులు.. వైరస్​ను అడ్డుకునేదెలా?

US covid cases: ప్రపంచంపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. అమెరికాలో కొత్తగా 2లక్షలకుపైగా కేసులు బయటపడ్డాయి. మొత్తం మీద 24గంటల వ్యవధిలో 2,67,269మందికి కొవిడ్​ సోకింది. దీంతో మొత్తం కేసు సంఖ్య 5.2కోట్లు దాటింది. 1,149 తాజా మరణాలతో మృతుల సంఖ్య 8.3లక్షలకు చేరింది.

అమెరికాలో కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా ఆసుపత్రుల్లో వైద్యవ్యవస్థపై భారం పడుతోంది. ఈ క్రమంలో అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్​ సోకితే.. 10రోజుల పాటు పనికి దూరంగా ఉండాలని ఇప్పటివరకు ఉన్న నిబంధనను 7రోజులకు కుదించారు.

మరోవైపు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్​ జామ్​ అవుతోంది.

మరోవైపు న్యూయార్క్​లోని ప్రఖ్యాత టైమ్స్​ స్క్వేర్​ వద్ద న్యూఇయర్​ వేడుకలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. అయితే వీక్షకుల సంఖ్యను 15వేలకు కుదించనున్నట్టు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నట్టు సర్టిఫికెట్లు చూపిస్తేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

బ్రిటన్​లో...

UK covid cases: బ్రిటన్​లో రోజువారీ కేసులు సంఖ్య మరోమారు లక్ష దాటేసింది. తాజాగా 1.19లక్షలమంది కొవిడ్​ బారినపడ్డారు. దీంతో కేసుల సంఖ్య 2.2కోట్లు దాటింది. తాజాగా.. 147మంది మరణించగా.. మృతుల సంఖ్య 1.47లక్షలు దాటింది.

అటు ఐరోపాలోనూ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఇటలీ ఆంక్షల్లోకి జారుకుంది. ఒమిక్రాన్​ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో.. టీకాలు వేసుకోని ప్రజలు మ్యూజియంలు, ఎగ్జిబిషన్లు, పార్కులు, హాల్స్​లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేసింది. న్యూఇయర్​ వేడుకలను కుదించింది.

ఫ్రాన్స్​లో కొత్తగా 91,608 కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య 88లక్షలు దాటింది. అటు స్పెయిన్​లో 72వేలు (మొత్తం 57లక్షలు) జర్మనీలో 39వేల కేసులు (మొత్తం 69లక్షలు) బయటపడ్డాయి.

ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు తొలి ట్యాబ్లెట్- వైరస్​పై గెలుపు ఇక సులువయ్యేనా?

Last Updated :Dec 24, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.