ETV Bharat / international

హెచ్​-4 వీసాలపై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు!

author img

By

Published : Feb 9, 2021, 10:57 AM IST

హెచ్​-4 వీసాలపై ఉమ్మడి నివేదిక సమర్పించాలని అమెరికా అప్పీల్​ కోర్టు సంబంధిత విభాగాలను ఆదేశించింది. మార్చి 5వ తేదీ వరకు గడువు విధించింది. 2015లో హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీస్​ విభాగం జారీ చేసిన నిబంధనపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశించింది.

US court seeks joint status report on H4 visas
హెచ్​-4 వీసాలపై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు!

హెచ్​1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఇచ్చే హెచ్​-4 వీసాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది అగ్రరాజ్య కోర్టు. ఈ వీసాల ప్రస్తుత స్థితిపై మార్చి 5వ తేదీ లోపు ఉమ్మడి నివేదిక ఇవ్వాలని సంబంధిత విభాగాలను కోరింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హయాంలో హెచ్​-4 వీసాలపై తీసుకున్న నిర్ణయాలని ఉపసంహరిస్తున్నట్లు బైడెన్​ పాలక వర్గం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

అమెరికాలోని ఉద్యోగాలను కాపాడాలని కోరుతూ 2015 నిబంధనను సవాల్​ చేస్తూ ఫెడర్​ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్​ విచారణలో భాగంగా ఇమ్మిగ్రేషన్​ విభాగాలకు లేఖ రాశారు యూఎస్​ కోర్ట్​ ఆఫ్​ అప్పీల్స్​ డిస్ట్రిక్ట్​ ఆఫ్​ కొలంబియా సర్క్యూట్​ జడ్జి తన్య ఎస్ ​చుత్కాన్.

" ఇటీవలి కార్యనిర్వాహక, పరిపాలన నిర్ణయాల మేరకు.. సంబంధిత విభాగాలు సమావేశమై మార్చి 5వ తేదీలోపు ఉమ్మడి స్టేటస్​ నివేదికను సమర్పించాలి. 1. ప్రస్తుత వివాదం పరిష్కారమైందా లేదా పార్టీలు పరిష్కారమైనట్లు భావిస్తున్నాయా? 2. ఏదైనా కారణం చేత గత నిర్ణయంపై స్టే విధించాలనుకుంటున్నారా? 3. ఫెడరల్​, స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఈ వ్యాజ్యం కొనసాగించాలని పార్టీలు అంగీకరిస్తాయా? నివేదికతో పాటు ప్రతిపాదిత ఉత్తర్వులను అందించాలి. "

- తన్య ఎస్​ చుత్కాన్​, అమెరికా అప్పీలు కోర్టు, కొలంబియా

2015లో హోమ్​లాండ్​ సెక్యూరిటీస్​ విభాగం (డీహెచ్​ఎస్​) హెచ్​-1బీ వీసాదారుల భాగస్వాములు చట్టబద్ధంగా ఉపాది పొందేందుకు ఓ నిబంధన జారీ చేసినట్లు తన లేఖలో గుర్తు చేశారు న్యాయమూర్తి. ఈ నియమం తమ ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో లింగ అసమానతలను సరిచేసేందుకు కీలకంగా మారిందన్నారు. హెచ్​4 వీసాదారుల్లో 95 శాతం మంది మహిళలే ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్రంప్​ పరిపాలన విభాగం..తమ 4 ఏళ్ల పరిపాలన కాలంలో.. హెచ్​-1బీ వీసాల జీవిత భాగస్వాములకు పని అధికారాన్ని ఇచ్చే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో కోర్టుకు తెలిపింది. అయితే.. 2015 నిబంధనను రద్దు చేయలేదని వెల్లడించింది.

ఇదీ చూడండి: 'హెచ్​4 వీసాలపై నిర్ణయం.. బైడెన్​ నిబద్ధతకు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.