ETV Bharat / international

అమెరికాలో కరోనా మరణమృదంగం- 15వేలు దాటిన మృతులు

author img

By

Published : Apr 10, 2020, 5:44 AM IST

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రధానంగా న్యూయార్క్​లో గురువారం 799 మంది వైరస్​ కారణంగా బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు.

US coronavirus death toll jumps to over 15,000: Johns Hopkins tally
అమెరికాలో కరోనా మరణమృదంగం- 15వేలు దాటిన మృతులు

ప్రపంచదేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా అమెరికాపై పంజా విసురుతోంది. ప్రధానంగా న్యూయార్క్​లో గురువారం 799 మంది మృతి చెందారు. వరుసగా మూడోరోజు అత్యధిక మరణాలు సంభవించినట్లు రాష్ట్ర గవర్నర్​ తెలిపారు. అయితే ఐసీయూ, ఇంక్యుబేషన్​లో చేరుతున్న వారి సంఖ్య తగ్గినట్లు పేర్కొన్నారు.

న్యూయార్క్​లో ఇప్పటివరకు 7వేల మందికి పైగా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గురువారం నాటికి మొత్తం మృతుల సంఖ్య 15,774కు చేరింది. కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షల 50 వేలు దాటింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.