ETV Bharat / international

'ఆఫ్​-క్యాంపస్​ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి'

author img

By

Published : Apr 18, 2020, 10:38 PM IST

Requirement for Off-Campus Posts in America
అమెరికా క్యాంపస్​ ప్రాంగణంలో ఉద్యోగ దరఖాస్తులకు ఆహ్వానం!

అమెరికాలో చిక్కుకుపోయిన విదేశీ విద్యార్థులకు ట్రంప్​ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడ్డ సంక్షోభంతో ఆర్థికంగా ఇబ్బందిపడే విదేశీ విద్యార్థులు ఇక ఆఫ్‌-క్యాంపస్‌ ఉద్యోగం చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఇబ్బందిపడే విద్యార్థులు.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫలితంగా భారత్‌తోపాటు విదేశాలకు చెందిన వేలమంది విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లైంది.

ఊహించని విధంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. విశ్వవిద్యాలయాలు మూతపడటం వల్ల ప్రజలందరూ వారి నివాసాలకే పరిమితయ్యారు. ఈ సమయంలో విద్యార్థులకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు ఆగిపోగా.. అంతర్జాతీయ కరెన్సీ మారకపు విలువలు పడిపోయాయి. ఫలితంగా ట్యూషన్‌ ఫీజులు, నివాస ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాలతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదర్కొంటున్నారు.

ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే విదేశీ విద్యార్థులు క్యాంపస్‌లో పనిచేయడానికి వీలు కల్పిస్తున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్​సీఐఎస్​) ప్రకటించింది. ఇలాంటివారు అధికారిక ధృవీకరణకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించిన తరువాత నిబంధనలకు లోబడిన వారికి అనుమతి లభిస్తుంది.

ఏడాదిపాటు..

అమెరికాలో కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో... తగ్గించే దిశగా గత నెలలోనే ఉపశమన చర్యలను ఆ దేశ ప్రభుత్వం. దాదాపు చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడినందున చాలా మంది విద్యార్థులు తమ హాస్టళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వీరికి నివాస ఖర్చు భారమయ్యింది. దీంతో కొందరు తమ సొంత దేశాలకు వెళ్లిపోగా.. అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలతో మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొందరిని అక్కడ స్థిరపడ్డావారు ఆదుకోగా, చాలామంది విద్యార్థులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో క్యాంపస్‌ పరిధిలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ మీ అభ్యర్థనను యూఎస్​సీఐఎస్​ అనుమతించినట్లయితే ఏడాదిపాటు క్యాంపస్‌ ప్రాంగణంలో ఉద్యోగం చేసుకోవడానికి వీలుంటుంది.

ఇదీ చదవండి: ట్రంపరితనానికి కళ్లెం వేసిన కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.