ETV Bharat / international

'భారత్​తో భాగస్వామ్యం కోసం ఆసక్తిగా చూస్తున్న అమెరికా'

author img

By

Published : Sep 20, 2021, 11:01 AM IST

US-India Business Council chief
భారత్​-అమెరికా సంబంధాలు

భారత్​తో కలిసి పనిచేసేందుకు(India America relations), ఇరు దేశాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేందుకు అధ్యక్షుడు జో బైడెన్​ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు యూఎస్​-ఇండియా బిజినెస్​ కౌన్సిల్​ అధ్యక్షురాలు నిశా దేశాయ్​(india us strategic partnership). ప్రధాని మోదీ, బైడెన్​ ఆచరణాత్మకమైన నేతలని కొనియాడారు.

భారత్​తో భాగస్వామ్యం కోసం(India US strategic partnership) అధ్యక్షుడు జో బైడెన్​ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు అమెరికా-ఇండియా బిజినెస్​ కౌన్సిల్(us India business council meeting)​ అధినేత నిశా దేశాయ్​ బిస్వాల్​. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపై(India America relations) ప్రధానంగా దృష్టిసారించినట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆచరణాత్మకమైన నేతలని కొనియాడారు నిశా.

అమెరికా ఛాంబర్​లో జరిగిన యూఎస్​-ఇండియా బిజినెస్​ కౌన్సిల్​ సమావేశంలో(us India business council meeting).. సరికొత్త సాంకేతిక అవకాశాలు, ఆర్థిక సాయం, భారత్​ క్లీన్​ ఇన్​ఫ్రాలో పెట్టుబడుల అంశాలపై చర్చించినట్లు చెప్పారు నిశా. మోదీ, బైడెన్​లు ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంపై ఎలా వ్యవహరిస్తారనే దానిపై వాణిజ్య సహకారం ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈవారం చివర్లో చేపట్టనున్న మోదీ అమెరికా పర్యటనపైనా(modi us visit 2021) పలు విషయాలు వెల్లడించారు.

" భారత్​తో భాగస్వామ్యం కోసం బైడెన్​ పరిపాలన విభాగం ఎంతో ఆసక్తిగా ఉంది. మోదీ, బైడెన్​ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వారం చివర్లో శ్వేతసౌధంలో తొలిసారి వారు నేరుగా కలవనున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, క్వాడ్​తో పాటు యూఎన్​జీఏ భేటీల్లో పాల్గొంటారని భావిస్తున్నా. ఆ సమావేశాల్లో కరోనా మహమ్మారి కీలక అంశంగా మారనుంది. ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెడతారనుకుంటున్నా. అలాగే.. ఇరు దేశాల మధ్య పర్యావరణ మార్పులపై భాగస్వామ్యం కీలకంగా మారనుంది. ఈ-మొబిలిటీలో గ్రీన్​ హైడ్రోజన్​, సరఫరా గొలుసును ఏర్పాటు చేయటం వంటి అంశాల్లో భారత్​ దృష్టి సారించింది. ఇరు దేశాలను మరింత బలమైన భాగస్వామ్యం దిశగా నడిపించే అవకాశాన్ని ఇరువురు నేతలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా."

- నిశా దేశాయ్​ బిస్వాల్​, భారత్​-అమెరికా వాణిజ్య కౌన్సిల్​ అధ్యక్షురాలు.

ఒబామా​ ప్రభుత్వంలో సెంట్రల్​ ఆసియాకు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు నిశా దేశాయ్​. 2014లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కీలక పాత్ర పోషించారు.

తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్​(quad meeting 2021) సమావేశంలో పాల్గొనేందుకు ఈ వారంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ(modi us visit 2021).. అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

ఇదీ చూడండి: modi US visit 2021: అమెరికాలో మోదీ షెడ్యూల్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.