ETV Bharat / international

'ఇండో-పసిఫిక్​ అభివృద్ధికి క్వాడ్​ తోడ్పాటు'

author img

By

Published : Mar 17, 2021, 10:40 AM IST

Quad to lead Indo-Pacific towards more positive vision: US diplomat
'ఇండో- పసిఫిక్​ అభివృద్ధికి క్వాడ్​ తోడ్పడుతుంది'

గత వారం జరిగిన క్వాడ్​ సదస్సు చారిత్రకమని ఆమెరికా దౌత్యవేత్త అతుల్​ కేశప్​ అన్నారు. ఇండో- పసిఫిక్​ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు క్వాడ్​ కృషి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఇటీవల వర్చువల్​గా జరిగిన చతుర్భుజ కూటమి(క్వాడ్​) దేశాల సమావేశాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు అమెరికా దౌత్యవేత్త అతుల్​ కేశప్. క్వాడ్​ దేశాలు తమ శక్తియుక్తుల్ని పెంచుకోవడానికి తగిన భరోసాను ఈ సదస్సు కలుగజేసిందని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం అవసరమని నొక్కి చెప్పిందని పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వంలో తూర్పు ఆసియా, పసిఫిక్​ ప్రాంతంలోని వ్యవహారాలను పర్యవేక్షించే ప్రిన్సిపల్​ డిప్యూటీ అసిస్టెంట్​ సెక్రటరీ అతుల్​ కేశప్​.. పెర్త్​ యూఎస్​ ఆసియా సెంటర్​ అండ్​ యూఎస్​ స్టడీ సెంటర్​ మంగళవారం నిర్వహించిన కాన్ఫరెన్స్​లో వర్చువల్​గా ప్రసంగించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో కూడిన ఈ క్వాడ్ కూటమి సదస్సు శుక్రవారం జరిగింది. 2007లో ఈ కూటమి ఏర్పాటు కాగా.. తొలిసారి దేశాధినేతల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమానత్వం కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ భేటీలో నేతలంతా ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై అందరికీ హక్కుందని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఏర్పడింది.

ఇదీ చదవండి: 'ఇండో-పసిఫిక్​లో శాంతి, సుస్థిరతకు క్వాడ్ కీలక పాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.