ETV Bharat / international

న్యూయార్క్​లో థియేటర్స్ రీఓపెన్- షోకు 50 మందే!

author img

By

Published : Oct 18, 2020, 6:13 PM IST

న్యూయార్క్​లో వచ్చేవారం నుంచి సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతించారు ఆ రాష్ట్ర గవర్నర్​. ఒక్కో థియేటర్​లో 50 మందికన్నా ఎక్కువ ప్రేక్షకులు ఉండరాదని స్పష్టంచేశారు.

Movie theatres to reopen in New York state next week
న్యూయార్క్​లో 'తెర'చుకోనున్న థియేటర్లు!

అమెరికాలోని న్యూయార్క్​లో సినిమా థియేటర్లు త్వరలోనే పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో మూతపడిన థియేటర్లు వచ్చే శుక్రవారం తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు అక్కడి గవర్నర్​ ఆండ్రూ క్యూమో.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని.. ప్రతి స్క్రీన్​కూ సీట్ల సామర్థ్యంలో 25శాతం(గరిష్ఠంగా 50 మంది) ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని క్యూమో స్పష్టంచేశారు. థియేటర్​ ఆవరణలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు.

న్యూయార్క్​లోని గ్లోబల్​ సినిమా ఫెడరేషన్​ సభ్యులు.. సినీ థియేటర్లు తిరిగి తెరిచేందుకు అనుమతినివ్వాలని కోరుతూ క్యూమోకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తిని అంగీకరించారు క్యూమో.

ఇదీ చదవండి: అగ్రరాజ్య కాంగ్రెస్​కు భారతీయ అమెరికన్ల కళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.