ETV Bharat / international

సముద్ర జంతువుపై ట్రంప్ పేరు.. ఈ పని ఎవరిది?

author img

By

Published : Jan 12, 2021, 4:11 PM IST

భారీ జలచర జంతువుపై ట్రంప్ పేరును చెక్కారు ఆకతాయిలు. ఫ్లోరిడాలోని హోమోససా నదిలో ఈ జీవిని గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.

Manatee with 'Trump' etched into its back spotted in US
సముద్ర జంతువుపై ట్రంప్ పేరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు వ్యతిరేకంగా.. సముద్రపు జీవితో నిరసన తెలియజేశారు కొందరు ఆగంతుకులు. 'మనటీ' అని పిలిచే భారీ జలచర జంతువుపై ట్రంప్ పేరును ఆంగ్లంలో చెక్కారు. ఫ్లోరిడాలోని హోమోససా నదిలో అమెరికా మత్స్య, వణ్యప్రాణి సేవల సిబ్బంది ఈ జీవిని గుర్తించారు. దీనికి కారణమైనవారిని కనిపెట్టే పనిలో పడ్డారు అధికారులు.

  • Can this even be real? A manatee was discovered in Florida with the word “Trump” scraped on its back. pic.twitter.com/PH8YcmGRnz

    — George StroumbouloPHÒulos 🐺 (@strombo) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతరించిపోతున్న ఈ జీవులను హింసించినందుకు నిందితులు క్లాస్-ఏ క్లిమినల్ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేరారోపణ రుజువైతే 50 వేల డాలర్లు జరిమానా, ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తారు.

దీనిపై విచారణ చేపడుతున్నామని ఫెడరల్ వైల్డ్​లైఫ్ సీనియర్ అధికారి క్రైగ్ కవాన్నా తెలిపారు. అయితే జీవి ప్రమాదకర స్థాయిలో గాయపడలేదని వెల్లడించారు. శరీరం మీద పెరిగిన నాచుపై పేరు రాసినట్లు తెలుస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి: 'బైడెన్​ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.