ETV Bharat / international

ట్రంప్ ​X బైడెన్​: గెలిచేదెవరో తేలేది కోర్టులోనే!

author img

By

Published : Nov 3, 2020, 4:00 PM IST

అగ్రరాజ్యానికి అధిపతిని ఎన్నుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. ఈసారి రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ మధ్య పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ మహా సంగ్రామం.. ఎలక్షన్​ డే(నవంబర్​ 3న) రోజు రాత్రి ఫలితాలతో ముగిసేలా లేదు. విజేతను తేల్చే తుది నిర్ణయం కోసం ఇరు బృందాలు సుప్రీంకోర్టులోనూ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం వేల మంది న్యాయవాదులతో కూడిన 'లీగల్ ఆర్మీ'లను రంగంలోకి దింపుతున్నాయి.

us polls 2020
ట్రంప్​Xబైడెన్​: గెలిచేదెవరో తేలేది న్యాయస్థానంలోనే..?

సాధారణంగా ఎన్నికల సంగ్రామం అంటే నామినేషన్లతో మొదలై.. ప్రచారాలు, పోలింగ్​, ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అభ్యర్థి ఆఖరికి విజేతగా నిలుస్తారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరిస్థితి వేరు. లెక్కింపు తర్వాత కూడా ఎన్నికల వేడి కొనసాగుతుంది. తుది ఫలితం తేల్చుకునేందుకు అభ్యర్థులిద్దరూ న్యాయస్థానంలోనూ పోరాడతారు.

వేల మందితో ఆర్మీలు..

అగ్రరాజ్యంలో కరోనా చిక్కుల వల్ల ప్రత్యక్షంగా పోలింగ్​ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రత్యామ్నాయంగా ఉన్న 'మెయిల్​ ఇన్​ బ్యాలెట్'​ను ఎక్కువ మంది ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్​ సేకరణ, లెక్కింపునకు సమయం పట్టనుంది. అంతేకాదు వీటి విషయంలో పారదర్శకత కోసం కోర్టు మెట్లు ఎక్కనున్నాయి ఇరువర్గాలు. సంతకాలు సరిపోలలేదని తిరస్కరణ నుంచి ఆబ్సెంటీ ఓట్లు, డ్రాప్​ బాక్స్​ల సేకరణ, సీక్రెట్​ ఎన్వలప్​ల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరిగినా న్యాయస్థానంలో తేల్చుకునేందుకు ట్రంప్​, బైడెన్​ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

ప్రతి ప్రాంతంలోని ఫలితాలు కీలకం కావడం వల్ల.. పర్యవేక్షణ కోసం వేల మంది న్యాయవాదులతో లీగల్​ ఆర్మీలను ఏర్పాటు చేసుకున్నాయి రెండు పార్టీలు. ఒక్క వ్యక్తి ఓటు విషయంలో తేడా వచ్చినా ఆయా పార్టీల లీగల్​ ఆర్మీలు.. కోర్టుల్లో కొట్లాడనున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెన్సిల్వేనియా, ఉత్తర​ కరోలినా, మిన్నెసోటా, నెవాడా ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

ఒక వేళ తుది విజేతను నిర్ణయించడం కష్టతరమైతే సుప్రీంకోర్టు కీలకంగా వ్యవహరిస్తుంది. 2000 సంవత్సరంలో ఇదే విధంగా బుష్​ను అధ్యక్షుడిగా ప్రకటించింది.

ఇదీ జరిగింది...

2007, నవంబర్​ 7న 54వ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రిపబ్లికన్​ అభ్యర్థి జార్జ్​ డబ్ల్యూ బుష్​(టెక్సాస్​ గవర్నర్​), డెమొక్రటిక్​ అభ్యర్థి ఏఐ గోర్(అప్పటి ఉపాధ్యక్షుడు) అధ్యక్ష పీఠం కోసం పోటీపడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే బుష్​కు తక్కువ ఓట్లు వచ్చినా విజేతగా నిలిచారు. అందుకే దీన్ని అమెరికా చరిత్రలో తీవ్రమైన పోటీ ఎదుర్కొన్న ఎన్నికగా పేర్కొంటారు.

  • సీట్లు: 538
  • మెజార్టీ మార్క్: 270
  • ఎవరికెన్ని: బుష్​(271), గోర్(266)

సాధారణంగా ఎన్నికల తేదీ రాత్రి నాటికి ఎవరు గెలిచారనేది తేలిపోతుంది. 2007లో మాత్రం కీలకమైన ఫ్లోరిడాలోని ఓట్ల రీకౌంటింగ్​ ద్వారా విజేతను నిర్ణయించింది సుప్రీంకోర్టు. రీకౌంటింగ్​ వల్ల దాదాపు నెలరోజుల తర్వాత అంటే డిసెంబర్​ 12న అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడింది. విజేతను నిర్ణయించిన ఫ్లోరిడాలో.. బుష్​ 537 ఓట్ల తేడాతో నెగ్గి ఆ ప్రాంతంలోని 25 స్థానాలు కైవసం చేసుకున్నారు. అలా మొత్తం 271 స్థానాలతో.. గోర్​(266)ను ఓడించి అధ్యక్షుడయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బుష్​(50,456,002) కంటే ప్రత్యర్థి గోర్​(50,999,897) దాదాపు 5,43,895 ఓట్లు ఆధిక్యం సంపాదించినా ఓడిపోవడం విశేషం.

బుష్​-గోర్​ ఎన్నికల తర్వాత లీగల్​ ఆర్మీల హవా మొదలైంది. ఈ ఏడాది ట్రంప్​, బైడెన్​ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న నేపథ్యంలో.. మరోసారి ఆయా బృందాలకు ప్రాధాన్యం ఏర్పడింది. తుది ఫలితంపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.