ETV Bharat / international

కాబుల్​ పేలుళ్లకు తాలిబన్ల సాయం! ఆ రెండు చెక్​పోస్టులు దాటించి...

author img

By

Published : Aug 27, 2021, 7:19 PM IST

కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన పేలుళ్లతో(kabul airport blast) ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానాశ్రయం వద్ద తాలిబన్లు భద్రతా వ్యవహారాలను చూసుకుంటున్నారు. దీనికి అమెరికా ఎలా ఒప్పుకుందని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ దాడులకు తాలిబన్లతో(taliban news) సంబంధం లేదని అమెరికా చెబుతోంది.

US
అమెరికా

కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన జంట దాడులను(kabul airport blast) ప్రపంచ దేశాలు ముందే గుర్తించినప్పటికీ, సకాలంలో స్పందించలేదు. ఈ కారణంగా 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఐసిస్​-కే సభ్యులు అక్కడి వరకు ఎలా వెళ్లగలిగారన్న విషయంపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. భద్రత విషయంలో అమెరికా దారుణంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ చెక్​పోస్ట్​లు ఎలా దాటారు?

తాలిబన్ల(taliban news) ఆక్రమణ అనంతరం కాబుల్​ విమానాశ్రయానికి అఫ్గానీలు పరుగులు పెట్టారు. వారం రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దేశాన్ని వీడేందుకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి అమెరికా దళాలు. సహాయం అందించేందుకు తాలిబన్లు ముందుకు రావడం విశేషం.

రద్దీగా ఉంటున్న విమానాశ్రయం ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులు చేయవచ్చని అమెరికా, బ్రిటన్​, ఆస్ట్రేలియా వంటి దేశాలు హెచ్చరించాయి. అయినా సకాలంలో అధికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి:- కాబుల్​లో గుబుల్​​.. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన

యూఎస్​ ఆర్మీ 10వ మౌంటైన్​ డివిజన్​ ఎయిర్​పోర్ట్​ పరిసరాల్లో భద్రత కల్పిస్తోంది. యూఎస్​ 82వ ఎయిర్​బోర్న్​ డివిజన్​కు రన్​వే భద్రతను అప్పగించారు. పౌరుల తరలింపును 24వ మెరైన్​ ఎక్స్​పిడీషనరీ బృందం చూసుకుంటోంది. మొత్తం మీద విమానాశ్రయంలో 6,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు(us forces in kabul airport). విమానాశ్రయం బయట తాలిబన్లు గస్తీ కాస్తున్నారు. 'రెడ్​ యూనిట్​' పేరుతో అత్యున్నత దళాన్ని రంగంలోకి దింపారు తాలిబన్లు.

గురువారం.. అబ్బే గేట్​, బారొన్​ హోటల్​ ప్రవేశ ద్వారం వద్ద దాడులు జరిగాయి. దాడులకు పాల్పడిన వారు అక్కడికి ఎలా వెళ్లగలిగారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాలిబన్లు గస్తీకాస్తున్న రెండు చెక్​పోస్టులు దాటితే కాని అక్కడివరకు వెళ్లడం కుదరదు.

'తాలిబన్ల తప్పేమీ లేదు..'

అమెరికా.. తాలిబన్ల సహాయం తీసుకోవడంపై అనేకమంది మండిపడుతున్నారు. వారి గురించి తెలిసి కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే తాలిబన్లను తాము విశ్వసించడం లేదని, సహాయం చేస్తామని వారు ముందుకు రావడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ వెల్లడించారు(biden on afghanistan). గురువారం జరిగిన దాడిలో వారి ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

"ఐసిస్​తో తాలిబన్లు చేతులు కలిపినట్టు నాకు ఎలాంటి సమాచారం అందలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా దీనిపై ఏం చెప్పలేదు. విమానాశ్రయం బయట తాలిబన్లు భద్రత కల్పించడంలో తప్పులేదు. మేము తాలిబన్లను విశ్వసించడం లేదు. వారంతట వారే ముందుకొచ్చారు. ఇందులో విశ్వాసం కన్నా.. పరస్పర ప్రయోజనాలే ఎక్కువ."

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా నిర్ణయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్​ సమర్థించుకున్నారు. దేశాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, ప్రజల తరలింపు ప్రక్రియలో వారి సహాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- Kabul airport blast: కాబుల్​ మృతులకు సంతాపంగా జెండా అవనతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.