ETV Bharat / international

తోటి వైద్యురాలిని కాల్చి చంపి.. తానూ ఆత్మహత్య

author img

By

Published : Jan 28, 2021, 5:54 PM IST

అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. పిల్లల వైద్యుడైన భారతీయ-అమెరికన్​.. మరో వైద్యురాలిని కాల్చి చంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Indian-origin pediatrician fatally shoots another doctor, himself after taking hostages in Texas
భారతీయ-అమెరికన్​ కాల్పుల్లో పిల్లల వైద్యుని మృతి

భారతీయ-అమెరికన్ వైద్యుడు జరిపిన కాల్పుల్లో ఓ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్​ ఆస్టిన్​లో జరిగిన ఈ ఘటనలో నిందితుడు పిల్లల వైద్యుడు డాక్టర్ భరత్​ నారుమంచిగా గుర్తించారు పోలీసులు. గత కొన్నాళ్లుగా అతను క్యాన్సర్​తో బాధపడుతున్నట్టు తెలిపారు.

క్యాన్సర్​ చికిత్స..

క్యాన్సర్​కు చికిత్స తీసుకుంటున్న భరత్ నారుమంచి ఆరోగ్య స్థితి సరిగా లేదని టెక్సాస్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆసుపత్రిలో వలంటీరుగా చేరేందుకు కొద్ది రోజుల క్రితం ప్రయత్నించాడని, అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. ఇటీవలే ఆ ఆసుపత్రిని దుండగుడు సందర్శించినట్లు తెలిపారు.

తుపాకీతో ఆసుపత్రిలోకి ప్రవేశించిన భరత్​.. పలువురిని బందీలుగా చేసుకున్నాడు. అందులో కొందరు తప్పించుకోగా.. మరికొంత మందిని వదిలిపెట్టాడు. కానీ, కేథరిన్​ డాడ్సన్​ను విడిచిపెట్టలేదు. ఆమెపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వత తనను తాను కాల్పుకుని మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'అమెరికాలో 'క్యాపిటల్​' తరహా ఘటనలకు ఛాన్స్​
'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.