ETV Bharat / international

ఫేస్​బుక్ చూస్తే చెంపదెబ్బ కొట్టేందుకు ఉద్యోగం- ఐడియాకు మస్క్ ఫిదా

author img

By

Published : Nov 12, 2021, 6:57 PM IST

ఫేస్​బుక్​లో గంటల కొద్దీ కాలక్షేపం చేసే ఓ సంస్థ సీఈఓ.. ఆ అలవాటును మార్చుకునేందుకు చేసిన వినూత్న ఆలోచన టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ను(elon musk news) విపరీతంగా ఆకర్షించింది. ఫేస్​బుక్​ వినియోగిస్తే చెంపదెబ్బ కొట్టించుకునేందుకు మహిళను నియమించుకున్న ఆ సీఈఓ కథేంటో చూద్దాం.

Indian-American man hires woman at $8 an hour to slap him every time he uses Facebook: Elon Musk is impressed
ఫేస్​బుక్ ఓపెన్ చేస్తే మహిళతో చెంపదెబ్బ- ఐడియాకు మస్క్ ఫిదా..

భారత సంతతికి చెందిన అమెరికా యువ వ్యాపారవేత్త మనీశ్ సేఠి ఐడియా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్​ను తెగ ఇంప్రెస్ చేసింది(elon musk news). ఫేస్​బుక్​ కోసం రోజూ సగటున 6 గంటలు కేటాయించే మనీశ్​.. ఆ అలవాటు మార్చుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు. గంటకు 8 డాలర్లు చెల్లించి ఓ మహిళను నియమించుకున్నారు. ఇంతకీ ఆమె చేయాల్సిన పనేంటంటే.. మనీశ్ కంప్యూటర్​లో ఫేస్​బుక్ ఓపెన్​ చేసినప్పుడల్లా పడేల్​మని ఓ చెంప దెబ్బకొట్టాలి(facebook slap).

మహిళను నియమించుకునేందుకు 2012లో అమెరికా అడ్వర్​టైజ్​మెంట్​ కంపెనీకి మనీశ్​ ఓ యాడ్ ఇచ్చారు. 'నేను ఫేస్​బుక్ ఓపెన్ చేస్తే నాపై గట్టిగా అరవాలి, లేదా చెంపదెబ్బ కొట్టాలి' అని ప్రకటనలో చెప్పారు. ఇది జరిగి 9 ఏళ్ల తర్వాత టెస్లా అధినేత ఎలాన్​ మస్క్ దృష్టికి వచ్చింది(elon musk news latest). దీనిపై స్పందించిన ఆయన రెండు ఫైర్​ ఎమోజీలతో కామెంట్ చేశారు(elon musk facebook).

Indian-American man hires woman at $8 an hour to slap him every time he uses Facebook
ఫేస్​బుక్ ఓపెన్ చేస్తే మహిళతో చెంపదెబ్బ- ఐడియాకు మస్క్ ఫిదా

మస్క్ ట్వీట్​పై(elon musk news today) మనీశ్ కూడా స్పందించారు. 'మస్క్ పెట్టిన ఈ రెండు ఫైర్ ఎమోజీలకు అర్థం ఏమిటి? సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లొద్దని చెప్పే ఓ పురాణ కథకు ఆంతర్యమా? బహుశా కాలమే సమాధానం చెబుతుంది' అని పేర్కొన్నారు.

చేతులకు ధరించే డివైజ్​​లను తయారు చేసే పావ్లోక్ బ్రాండ్​ సంస్థకు మనీశ్ సేఠి యజమాని. అమెరికాలో యువవ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. 2012లో ఫేస్​బుక్ వచ్చిన కొత్తలో ఆయన ఎక్కువ సమయాన్ని అందులోనే గడిపేవారు. దీంతో తన ఉత్పాదకత దెబ్బతింటుందని, ఎలాగైనా ఆ అలవాటు నుంచి బయటపడాలని వినూత్న ప్రకటన ఇచ్చి మహిళను నియమించుకున్నారు. ఓ దురలవాటు మానుకోవడం కోసం మహిళ చేతిలో ఎన్నిసార్లు చెంపదెబ్బలు తిన్నా(facebook slap) తప్పు కాదని అప్పుడు చెప్పారు. చివరకు మనీశ్​ ప్లాన్ సత్ఫలితాన్నిచ్చింది. మహిళను నియమించుకున్నాక ఫేస్​బుక్​కు​ సమయం కేటాయించడం తగ్గిపోయింది. మనీశ్ చెంపదెబ్బ ప్రకటనకు 20 మంది నుంచి స్పందన రావడం గమనార్హం.

ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లోనూ ఈ హీరోయిన్స్ హిట్- ఒక్కరోజులో 10 రెట్లు లాభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.