ETV Bharat / international

'హాట్​డాగ్'​ తిండిబోతు టైటిల్​ మళ్లీ జోయి​కే​

author img

By

Published : Jul 5, 2021, 5:26 AM IST

Updated : Jul 5, 2021, 7:16 AM IST

ఏటా జులై 4న నిర్వహించే ప్రసిద్ధ నాథన్​ హాట్​డాగ్​ పోటీలు అమెరికా న్యూయార్క్​లో ఘనంగా ముగిశాయి. ఇందులో జోయి​ జాస్ తన రికార్డును తానే బ్రేక్​ చేశాడు.​ 10 నిమిషాల్లో 76 హాట్​డాగ్స్​ తినేసి 14వసారి విజేతగా నిలిచాడు.

Hot dog
హాట్​డాగ్ తిండిబోతు పోటీలు

హాట్​డాగ్ తిండిబోతు పోటీలు

కరోనా ప్రభావంతో గతేడాది నిరాడంబరంగా జరిగిన నాథన్ 'హాట్​డాగ్'​ తిండిపోటీలు.. అమెరికాలో ఈసారి మళ్లీ అట్టహాసంగా జరిగాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయి కేరింతలు కొడుతుండగా.. పోటీదారులు తిండి తినడం ప్రారంభించారు. ఈ పోటీల్లో జోయి జాస్ చెస్ట్​నెట్ తన రికార్డును తానే బద్ధలు గొట్టాడు. 76 హాట్​డాగ్స్, రొట్టెలు తినేసి.. 14వ సారి టైటిల్​ విజేతగా నిలిచాడు. మహిళా విభాగంలో 30 3/4 హాట్​డాగ్స్, రొట్టెలు మింగేసి.. మిచెల్లె లెస్కో తొలిసారి టైటిల్​ గెలిచింది.

Hot dog
హాట్​డాగ్​లను ఆరగిస్తున్న జోయి జాస్​
Hot dog
టైటిల్​ గెలిచిన జోయి జాస్​

అమెరికా న్యూయార్క్​లోని కోనీ ద్వీపంలోని ఓ బేస్​బాల్​ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. ఇక్కడ కాల్చిన బాణాసంచా వెలుగులు.. చూపరులను ఆకట్టుకున్నాయి. అమెరికాలోని పలు టీవీ ఛానెళ్లు ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

ఏటా జులై 4న

ఈ హాట్​డాగ్ తిండి పోటీలు 1972లో ప్రారంభమయ్యాయి. 1916లో ప్రారంభమైన నాథన్​ కంపెనీ ఈ పోటీలను అప్పటి నుంచే ప్రోత్సహిస్తోంది. ఏటా జులై 4న ఈ తిండిబోతు పోటీలు జరుగుతాయి. అయితే గతేడాది కరోనా సంక్షోభం కారణంగా.. పెద్దగా ప్రేక్షకులు లేకుండానే ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లోనూ జోయి జాస్ చెస్ట్​నెట్​ పది నిమిషాల్లో 75 హాట్​డాగ్స్​, రొట్టెలు తిని టైటిల్ గెలిచాడు. మహిళల విభాగంలో 47 హాట్​డాగ్స్, రొట్టెలు తిని.. మికీ సూడో ఏడోసారి విజేతగా నిలిచింది.

ఇదీ చూడండి: అద్దెకు 'బాల్కనీ'- గంటకు రూ.1800!

Last Updated : Jul 5, 2021, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.