ETV Bharat / international

కరోనా విలయం.. కోటిన్నర దాటిన కేసులు

author img

By

Published : Jul 22, 2020, 7:44 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలనూ చుట్టేసింది. కేసుల నమోదులో మరింత ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కోటీ 50 లక్షలమందికిపైగా వైరస్​ బారినపడ్డారు. 6.20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

Global COVID-19
కరోనా విలయం..కోటిన్నర దాటిన కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతూనే ఉంది. 200కుపైగా దేశాలు, చిన్న భూభాగాల్లో కలిపి కోటీ 50 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. 6.20 లక్షల మంది వరకు మృతి చెందారు. జులై నెలలో రోజూ సగటున 2 లక్షలు దాటి కొత్త కేసులొస్తున్నాయి. టీకాలు వస్తే తప్ప సాధారణ జీవన పరిస్థితులు నెలకొనే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, రష్యాల్లో అదే స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. పెద్ద దేశాలతో పాటు, పెరూ, చిలీ లాంటి చిన్న దేశాల్నీ వైరస్‌ కుదిపేస్తోంది.

  • మొత్తం కేసులు: 15,091,880
  • మొత్తం మరణాలు: 619,410
  • కోలుకున్నవారు: 9,110,208
  • యాక్టివ్​ కేసులు: 5,362,262

ఏయే దేశాల్లో ఎలా..

అమెరికాలో..

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి ఆగడం లేదు. కేసులు, మరణాలూ ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 40.28 లక్షలమందికిపైగా వైరస్​ సోకింది. మరో 1.44 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా న్యూయార్క్‌లో కేసులుండగా న్యూజెర్సీ, మసాచూసెట్స్‌, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోనూ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్‌, ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.

అమెరికాలో మొత్తం ఇంతవరకు 18.86 లక్షల మంది కోలుకోవడమే కొంతలో కొంత ఊరట.

బ్రెజిల్‌

కేసులు, మరణాల్లోనూ రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. 21.66 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 81 వేల మందికి పైగా చనిపోయారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి.

రష్యా

కేసులపరంగా కొద్ది రోజుల క్రితం వరకు మూడో స్థానంలో ఉన్న రష్యా.. భారత్‌లో కొవిడ్‌ ఉద్ధృతి పెరగడంతో నాలుగో స్థానానికి తగ్గింది. దేశంలో 7.83 లక్షలకు పైగా కేసులున్నాయి. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ మరణాలు కొంత తక్కువగానే ఉన్నాయి. మరణాల సంఖ్యలో రష్యా 11వ స్థానంలో ఉంది. 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాఫ్రికా

ఆఫ్రికా ఖండంలో దాదాపు సగం కేసులు ఈ దేశంలోనే ఉన్నాయి. 3.81 లక్షల మందికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. అయితే తీవ్రత ఎక్కువ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ మరణాలు కొంత తక్కువే. దాదాపు 5,368 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల పరంగా 22వ స్థానంలో ఉంది.

మెక్సికో

మరణాల పరంగా నాలుగో స్థానంలో ఉన్న మెక్సికోలో 3.56 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 40 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా4,028,569144,953
బ్రెజిల్2,166,53281,597
రష్యా783,32812,580
దక్షిణాప్రికా381,7985,368
పెరు362,08713,579
మెక్సికో 356,25540,400
చిలీ334,6838,677
స్పెయిన్313,27428,424
బ్రిటన్​295,81745,422

ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.