ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 93లక్షల 54వేలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Jun 24, 2020, 9:45 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్​ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 93లక్షల 54వేలు దాటింది. మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 4లక్షల 80వేలకు చేరువైంది. 50లక్షల 41వేల మందికి పైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. లాటిన్​ అమెరికా, కరేబియన్​ ప్రాంతాల్లో మరణాల సంఖ్య లక్ష దాటింది.

corona cases across the globe crossed 9.35 millon
ప్రపంచవ్యాప్తంగా 93లక్షల 54వేలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. ఇప్పటి వరకు 93లక్షల 54వేల 326 మంది వైరస్ బారినపడ్డారు. 4లక్షల 79వేల 816మందిని మహమ్మారి బలిగొంది. 50లక్షల 41వేల813 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న లాటిన్​ అమెరికా, కరేబియన్​ దేశాల్లో మరణాల సంఖ్య లక్ష దాటినట్లు గణాంకాలు వెల్లడించాాయి.

కరోనా దెబ్బకు అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 24లక్షల 24వేలు దాటింది. లక్షా 23వేల మందికిపైగా ప్రాాణాలు కోల్పోయారు. వైరస్​ ఉగ్రరూపం దాల్చుతున్న బ్రెజిల్​లో బాధితుల సంఖ్య 11లక్షల 51వేలు దాటగా.. మృతుల సంఖ్య 53వేలకు చేరువలో ఉంది.

మాస్కు లేకపోతే 25 డాలర్లు ఫైన్​..

కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది అమెరికా దక్షిణ కరోలినాలోని గ్రీన్​విల్లే నగరం. రెస్టారెంట్లు, రిటైల్​ స్టోర్లు, సెలూన్లు, సూపర్​ మార్కెట్లలోని సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించేలా నిబంధనలను అమలు చేసింది. సూపర్​ మార్కెట్లు, మెడికల్ షాపులకు వెళ్లే వారాకి తప్పనిరిగా మాస్కులు ఉండాలి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే 25డాలర్ల వరకు జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.

దేశంకేసులుమరణాలు
1అమెరికా24,24,168123,473
2బ్రెజిల్11,51,47952,771
3రష్యా5,99,7058,359
4భారత్4,56,18314,476
5బ్రిటన్3,06,21042,927
6స్పెయిన్2,93,83228,325
7పెరు2,60,8108,404
8చిలీ2,50,7674,505
9ఇటలీ2,38,83334,675
10ఇరాన్​2,09,9709,863

ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగం దురాక్రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.