ETV Bharat / international

జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌ షురూ

author img

By

Published : Jul 4, 2021, 12:12 PM IST

Updated : Jul 4, 2021, 12:32 PM IST

వ్యాధినిరోధక శక్తి పెంచేందుకు జంతువులకు టీకాలు వేస్తున్నారు. అమెరికాలోని ఒక్లాండ్​లో ఓ జూలో జంతువులకు టీకా వేశారు. జంతువులకు కరోనా కూడా సోకుతుండడం కారణంగా ఈ చర్యలు చేపట్టారు.

pet covid vaccine
జంతువులకు టీకా పంపిణీ

అమెరికాలో జంతువులకు టీకా పంపిణీ

జంతువులు కూడా కరోనా బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ వాటికి టీకా ప్రక్రియ మొదలుపెట్టింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్యంలోని ఒక్లాండ్​లో ఉన్న జంతుప్రదర్శనశాలలో కొన్ని జంతువులకు టీకా వేశారు సిబ్బంది.

జోటీస్ అనే ఔషధ తయారీ సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసం రూపొందించిన ఈ టీకాను పులులు, ఎలుగుబంట్లు, సింహాలకు ఇచ్చినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. జంతువుల రోగ నిరోధకశక్తి ఆధారంగా టీకాలు ఇస్తున్నట్లు వివరించారు. జోటీస్ సంస్థ ఇప్పటికే అమెరికాలోని 70 జంతుప్రదర్శనశాలలకు 11వేల టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: సముద్రంలో కూరగాయలనూ పండించేస్తున్నారు..!

Last Updated : Jul 4, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.