తాలిబన్ల మెరుపు వేగానికి బైడెన్ షాక్!

author img

By

Published : Aug 16, 2021, 9:14 PM IST

Joe Biden

అఫ్గానిస్థాన్​ను రోజుల వ్యవధిలోనే తాలిబన్లు హస్తగతం చేసుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర ఉన్నతాధికారులు షాక్​ అయ్యారని సమాచారం. కాగా, ఆ దేశంలో తమ మిలిటరీ చేపట్టిన నిష్కమణ ఆపరేషన్​కు అవరోధాలు సృష్టించకుండా ఉండాలని తాలిబన్లను యూఎస్ కోరినట్లు తెలుస్తోంది.

మెరుపు వేగంతో అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు చేజిక్కించుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. దానివల్ల ఒక ప్రణాళిక ప్రకారం అఫ్గాన్​ను వీడాల్సిన యూఎస్​ భద్రతా దళాలు.. వేగంగా, జాగ్రత్తగా తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇంత వేగంగా అఫ్గాన్​ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల.. కమాండర్​ ఇన్​ చీఫ్​గా ఉన్న బైడెన్​కు ఇది పరీక్షా సమయం లాంటిదే. ఇప్పటికే అఫ్గాన్​లో శాంతి నెలకొల్పడంలో ఆయన విఫలమయ్యారని రిపబ్లికన్​లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

కాగా, అమెరికా బలగాలు వైదొలుగుతున్న క్రమంలో ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారాన్ని అందుకున్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆధునిక సామగ్రిని అఫ్గాన్‌ దళాలకు అమెరికా అప్పగించింది. శిక్షణ ఇచ్చింది. అయినా తాలిబన్లతో ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోయాయి.

అడ్డురాకండి..

కాబుల్​ విమానాశ్రయంలో అమెరికా సైన్యం చేపట్టిన నిష్క్రమణ ఆపరేషన్​లో జోక్యం చేసుకోరాదని తాలిబన్ సీనియర్​ నేతలను సెంట్రల్​ కమాండ్​ అధిపతి కోరినట్లు యూఎస్ రక్షణ అధికారి ఒకరు తెలిపారు. లేని పక్షంలో అమెరికా దళాలు కూడా ప్రతి చర్యలకు ఉపక్రమిస్తాయని హెచ్చరించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: తాలిబన్ల మెరుపు వేగానికి కారణం.. ఈ దళం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.