ETV Bharat / international

'ఆ సంస్థలే కరోనా వ్యాక్సిన్‌ రేసులో ముందున్నాయ్​'

author img

By

Published : Jun 27, 2020, 5:39 AM IST

Updated : Jun 27, 2020, 12:46 PM IST

మహమ్మారి కరోనాకు ఈ ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే బ్రిటిష్​-స్వీడిష్​కు చెందిన సంస్థ ఆస్ట్రాజెనికా, అమెరికా సంస్థ మోడెర్నాలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Astrazeneca, Moderna most advanced in COVID-19 vaccine race WHO
ఆ రెండు సంస్థలే కరోనా వ్యాక్సిన్‌ రేసులో ముందున్నాయి: డబ్ల్యూహెచ్​ఓ

కరోనా వైరస్‌ సూదిమందుపై ఆశలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లోనే ఇది అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీని అభివృద్ధి, సామర్థ్యంలో బ్రిటిష్​-స్వీడిష్​కు చెందిన సంస్థ ఆస్ట్రాజెనికా అందరికన్నా ముందంజలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అమెరికా చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ సైతం ఆస్ట్రాజెనికా కన్నా మరీ వెనకేం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా 15 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సినోవాక్‌ సహా చైనాకు చెందిన బహుళ సంస్థలతో సూదిమందు అభివృద్ధి గురించి డబ్ల్యూహెచ్‌ఓ మాట్లాడిందని వెల్లడించారు. సంస్థలో కొన్ని డ్రగ్స్‌కు జరుగుతున్న సంఘీభావ ట్రయల్స్‌ మాదిరిగానే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఆమె పిలుపునిచ్చారు.

కొవిడ్‌-19 సూదిమందు ఏడాదిలోపు వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెయేసస్‌ ఐరోపా పార్లమెంటు కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి స్పందన విషయంలో తమవైపు నుంచి తప్పులు జరిగినట్టు ఆయన అంగీకరించారు. వీటి నుంచి పాఠాలు నేర్చుకొనేందుకు మదింపు కమిటీ వేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్​ఓ

Last Updated :Jun 27, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.