ETV Bharat / international

దక్షిణాఫ్రికాకు టీకా డబ్బులు తిరిగి చెల్లించిన సీరం​

author img

By

Published : Apr 9, 2021, 9:53 AM IST

Updated : Apr 9, 2021, 10:35 AM IST

దక్షిణాఫ్రికాలో వ్యాపిస్తున్న కరోనా రకంపై సీరం సంస్థ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతంగా పని చేయటం లేదని తేలగా.. ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా డోసుల సరఫరాను నిలిపివేయాలని సీరం​ సంస్థను కోరింది. దాంతో 5 లక్షల టీకా డోసుల సరఫరా చేసేందుకు తీసుకున్న డబ్బులను ఆ​ సంస్థ తిరిగి చెల్లించింది.

astrazeneca vaccine
దక్షిణాఫ్రికాకు సీరమ్​ సంస్థ టీకా డబ్బులు వాపస్​

5 లక్షల కొవిడ్​ వ్యాక్సిన్​ డోసుల సరఫరాకు సంబంధించిన నగదును దక్షిణాఫ్రికాకు తిరిగి చెల్లించింది సీరం​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​​ ఇండియా. తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా రకానికి సీరం​ సంస్థ​ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ ప్రభావవంతంగా పని చేయట్లేదని తేలినందున.. టీకా సరఫరాను నిలిపివేయాలని కోరినట్లు దక్షిణాఫ్రికా తెలిపింది. ఈ మేరకే డబ్బులను తమకు సీరం సంస్థ తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జ్వేలీ ఖిజే.

"5 లక్షల ఆస్ట్రాజెనెకా టీకా డోసులను సరఫరా చేయనందున సీరం​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా డబ్బులను తిరిగి చెల్లించింది. మా బ్యాంక్​ ఖాతాల్లో ఆ డబ్బులు ఇప్పటికే జమ అయ్యాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​తో సత్ఫలితాలు రానందున.. ఆ టీకాలను అనవసరంగా కొనుగోలు చేయవద్దని మేం నిర్ణయించుకున్నాం."

- జ్వేలీ ఖిజే, దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి

ఇప్పటికే పదిలక్షల ఆస్ట్రాజెనెకా​ టీకా డోసులను దక్షిణాఫ్రికాకు సీరం​ సంస్థ సరఫరా చేసింది. వాటిని ఆఫ్రికన్​ యూనియన్​లోని వివిధ​ దేశాలకు దక్షిణాఫ్రికా విక్రయించింది. అయితే.. తమ దేశంలో వ్యాపిస్తున్న కరోనా రకం మిగతా ఆఫ్రికన్​ దేశాల్లో లేనందున అక్కడ ఈ టీకాను వినియోగిస్తున్నట్లు జ్వేలీ ఖిజే తెలిపారు. కొత్త రకం వైరస్​పై ప్రభావం చూపే టీకాను ఉత్పత్తి చేసినప్పుడు తాము మళ్లీ సీరం​తో ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు.

ఫైజర్​, జాన్సన్​ అండ్​ జాన్సన్​ సంస్థలతో 51 మిలియన్ల టీకా డోసుల సరఫరా చేసేందుకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​తో రక్తం గడ్డ కట్టొచ్చు!

Last Updated :Apr 9, 2021, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.