ETV Bharat / entertainment

'విక్రమ్'​ యూనిట్​కు కమల్ గ్రాండ్​ విందు.. మెనూ మామూలుగా లేదుగా..!

author img

By

Published : Jun 18, 2022, 8:54 PM IST

లోకేశ్​ కనకరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్​' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో సక్సెస్, థ్యాంక్స్​ మీట్​లను నిర్వహించింది చిత్రబృందం. ఈ క్రమంలోనే 'విక్రమ్'​ టీమ్​కు అదిరిపోయే విందును ఏర్పాటు చేశారు కమల్. 'విక్రమ్​' మొదటి టీజర్​లో చూపించిన విధంగా అరటి ఆకులో భోజనాన్ని వడ్డించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

vikram success meet
vikram success meet menu

'విక్రమ్'.. 'విక్రమ్‌'.. 'విక్రమ్‌'.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. మొదటివారంలోనే సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే 'విక్రమ్‌' సక్సెస్‌ని చిత్రబృందం గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటుంది.

vikram success meet
'విక్రమ్' సక్సెస్ మీట్

ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సక్సెస్‌‌, థ్యాంక్స్‌ మీట్‌లు నిర్వహించిన టీమ్‌.. తాజాగా తమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసిన వారికి, థియేటర్‌ యజమానులకు స్పెషల్‌ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీలో కమల్‌హాసన్‌, చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ పాల్గొన్నారు. తమ చిత్రానికి భారీ విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.

vikram success meet
కమల్​ పార్టీలో 'విక్రమ్' చిత్రబృందం

కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. విక్రమ్‌ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. విజయ్‌తో లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కించనున్న తదుపరి చిత్రం విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. లోకేశ్‌ కనకరాజ్‌ మాట్లాడుతూ.. 'విక్రమ్‌' విజయం బాధ్యత పెంచిందని, ఇకపై మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని అన్నారు.

vikram success meet
.

కాగా, ఈపార్టీలో పాల్గొన్న వారి కోసం టీమ్‌ స్పెషల్‌ డిన్నర్‌ ఏర్పాటు చేసింది. వెజ్‌, నాన్‌ వెజ్‌, స్వీట్స్‌, ఐస్‌ క్రీమ్స్‌ ఇలా ఎన్నో రకాల వంటకాలతో భారీ మెనూనే సిద్ధం చేసింది. మటన్‌ కీమా బాల్స్‌, వంజరం తవా ఫిష్‌ ఫ్రై, నాట్టు కోడి సూప్‌, ప్రాన్‌ తొక్కు, మైసూర్‌ మసాలా దోశ, పన్నీర్‌ టిక్కా ఇలా చెప్పుకుంటూ వెళితే ఇంకా ఎన్నో వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి.

ఇక, ఈ విందులో లోకేశ్‌, కమల్‌, అనిరుధ్‌, ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రాగా నెటిజన్లు 'విక్రమ్‌ మెనూ అంటే ఆ మాత్రం ఉండాలిగా' అంటున్నారు. మరి కొంతమంది, ఈ విందుని చూసి 'విక్రమ్‌' అనౌన్స్‌మెంట్‌ వీడియోని గుర్తు చేసుకుంటున్నారు. 'విక్రమ్‌' అలా మొదలై.. ఇలా కొనసాగుతోంది..! అని చెప్పుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.