ETV Bharat / entertainment

రౌడీ హీరో క్రేజే వేరబ్బా.. బాలీవుడ్​ నుంచి మరో రెండు మెగా ఆఫర్లు!

author img

By

Published : Nov 4, 2022, 10:20 AM IST

Vijay devarkonda two bollywood offers
రౌడీ హీరో క్రేజే వేరబ్బా

క్రేజీ హీరో విజయ్​ దేవరకొండ బాలీవుడ్​ నుంచి మరో రెండు మెగా ఆఫర్లు వచ్చాయని తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఆ వివరాలు..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్​ గురించి తెలిసిందే. సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా.. కేవలం యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్​తో ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తొలి చిత్రంతోనే తన నటనతో అలరించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. అయితే ఇటీవలే లైగర్​తో భారీ పరాజయాన్ని అందుకున్న అతడితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఏమాత్రం వెనకాడటం లేదు. రీసెంట్​గా రౌడీ హీరో.. గౌతమ్‌ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరిపారట. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

అయితే ఈ హీరోకు మరో రెండు బంపర్ ఆఫర్లు వచ్చాయని తెలిసింది. బాలీవుడ్‌ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని టాక్‌. బీటౌన్​కు చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు విజయ్‌ను సంప్రదించారట. కరణ్‌ జోహార్‌ ఓ దర్శకుడితో కలిసి ఇటీవల విజయ్‌తో సినిమా గురించి మాట్లాడారని సమాచారం. మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విజయ్‌తో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు ప్లాన్‌ చేస్తోందట. ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘‘ఖుషి’’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన అగ్ర కథానాయిక సమంత నటిస్తోంది. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాపై విజయ్‌ అభిమానులు ఇప్పటికే భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి: ఈ ముద్దుగుమ్మల అదిరిపోయే పోజులు​ చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.