ETV Bharat / entertainment

టైమ్స్ స్క్వేర్‌పై 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్ - న్యూయార్క్‌లో ఫ్యాన్స్​తో సందడి చేసిన రౌడీ హీరో

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 6:29 PM IST

Vijay Devarakonda Family Star : 'ఫ్యామిలీ స్టార్' షూటింగ్ కోసం న్యూయార్క్‌ వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడి ఫ్యాన్స్​తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా మూవీ గ్లింప్స్​ను టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.

Vijay Devarakonda Family Star
Vijay Devarakonda Family Star

Vijay Devarakonda Family Star Shooting : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మూవీ టీమ్ న్యూయార్క్​లో సందడి చేస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్​ కోసం న్యూయార్క్​లోనే ఉన్న విజయ్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్​ బిల్డింగ్ వేదికగా 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్​ను చూపించారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్​ మీడియాలో ఆ వీడియో వైరల్​ అవుతోంది.

మరోవైపు మంగళవారంతో అమెరికాలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత భారత్​లో మరో 15 రోజులు షెడ్యూల్​ ఉండనుందని ఫ్యాన్స్​ . దీంతో సినిమా షూటింగ్​ మొత్తం పూర్తి అవుతుందని గతంలో నిర్మాత దిల్​ రాజు చెప్పారు.

Family Star Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మృణాల్​తో పాటు దివ్యాన్ష కౌశిక్​ నటిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేశ్​, కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టగా, ఏఎస్ ప్రకాశ్​ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్​లో 'ఐరనే వంచాలా ఏంటి' అంటూ విజయ్​ చెప్పే లైన్​ నెట్టింట తెగ హల్​చల్​ చేసిన సంగతి తెలిసిందే.

Vijay Devarakonda Movies : మరోవైపు విజయ్​ లైనప్​ విషయానికొస్తే రౌడీ బాయ్​ ప్రస్తుతం తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేమ్​ డైరెక్టర్​ గౌతమ్​ నాయుడు తిన్ననూరితో కలిసి చేస్తున్నారు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్​ ఫోర్ సినిమాస్​ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్​ను ప్రారంభించుకున్న ఈ మూవీకి తమిళ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్​ సంగీతాన్ని​ అందిస్తున్నారు.

సంక్రాంతి రేసు నుంచి 'ఫ్యామిలీ స్టార్​' ఔట్​ - అదే కారణమా?

Vijay Devarakonda Family Star Movie : 'ఫ్యామిలీ స్టార్'​గా రౌడీ హీరో.. గ్లింప్స్​ చూశారా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.