ETV Bharat / entertainment

తొలి సినిమాకే నంది అవార్డు - వెంకీ చైల్డ్​ ఆర్టిస్ట్​గా చేసిన చిత్రం ఏదంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 7:53 AM IST

Updated : Dec 13, 2023, 8:44 AM IST

Victory Venkatesh Birthday : తన నటనతో, సింపుల్​ మేనరిజంలో ఫ్యామిలీ ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్​. 90స్​ కిడ్స్​ నుంచి ఇప్పటి జనరేషన్​ వరకూ అందరి ఫ్యాన్​ ఫాలోయింగ్​తో దూసుకెళ్తున్న విక్టరీ వెంకటేశ్​ నేడు(డిసెంబర్​ 13)న తన 63 బర్త్​డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్​ హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

Etv Bharat
Etv Bharat

Victory Venkatesh Birthday : తన సిింపుల్​ మేనరిజంతో అభిమానులను ఆకట్టుకుంటారు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్​. ఫ్యామిలీ స్టార్​గా పేరొందిన ఆయన తన సినీ కెరీర్​లో ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఆడియెన్స్​ను అలరించారు. ముఖ్యంగా ఈయనకు మహిళల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సినిమా బ్యాక్​గ్రౌండ్​ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనతో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. చైల్డ్​ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన శ్రమతో టాప్ హీరోగా ఎదిగారు. వరుస విజయలతో దుసూకెళ్లి తన పేరును విక్టరీ వెంకటేశ్​గా మార్చుకున్నారు.

సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అందరు హీరోల అభిమానులు సైతం అభిమానించే స్టార్​ హీరోగా ఎదిగారు. ఇప్పటి ఫ్యాన్స్​ ఆయన్ను ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకుంటారు. అదే ఆయన ప్రత్యేకత. నేడు ఆయన 63వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..

ప్రముఖ నిర్మాత దిగవంగత దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లో స్థిరపడ్డారు. చెన్నైలో డిగ్రీ పూర్తి చేశాక అమెరికాలో తన ఎంబీఏ కోర్సును పూర్తి చేశారు.1971లో విడుదలైన 'ప్రేమ నగర్​' సినిమాతో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'కలియుగ పాండవుల' తో హీరోగా తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాకుండా తొలి చిత్రంతోనే నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక వరుస అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలా 'వారసుడొచ్చాడు', 'స్వర్ణకమలం', 'శ్రీనివాస కళ్యాణం', 'ప్రేమ', 'కూలీ నెం.1', 'బొబ్బిలిరాజా', లాంటి సినిమాల్లో నటించి వరుస విజయాలతో దూసుకెళ్లారు.

90స్ ప్రేక్షకులను అలరించినట్లుగానే ఈ తరం అభిమానులను తన నటనతో ఉర్రూతలూగించారు వెంకటేశ్​. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'గోపాల గోపాల', 'దృశ్యం', 'గురు', 'వెంకీ మామ', 'ఎఫ్ 2', 'ఎఫ్ 3',’నారప్ప’ లాంటి సినిమాలతో ఈయన యాక్టింగ్​ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్యారెక్టర్​లో లీనమైపో ఏడిపించడమ కాకుండా తన కామెడీ టైమింగ్​తో కడుపుబ్బా నవ్వించగల సత్త వెంకీకి ఉంది.

వెంకీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు
అప్పట్లో సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది స్టార్​ హీరోయిన్లను పరిచయం చేసింది వెంకీ మామనే. ఇప్పుడు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా మన వెంకీ స్కూల్ నుంచి వచ్చిన వారే. దివ్య భారతి, టబు, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి లాంటి స్టార్ హీరోయిన్లు వెంకీ సినిమాలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెరంగేట్రం చేశారు. వెంకటేష్ సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటాయి.

కాంట్రవర్సీలకు దూరం
చిత్ర పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తుల్లో వెంకటేశ్ కూడా ఒకరు​. తన సినిమాల గురించి తప్ప తన వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా చూసుకుంటారు ఈ ఫ్యామిలీ మేన్​. అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్​కు ఈయన అంటే చెప్పలేని అభిమానం.

Last Updated :Dec 13, 2023, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.