అరుదైన వ్యాధితో బాధపడుతున్న​ స్టార్​ హీరో.. బాడీ బ్యాలెన్స్​ తప్పిపోతుందంటూ ఆవేదన

author img

By

Published : Nov 5, 2022, 8:32 PM IST

Varun Dhawan

బాలీవుడ్‌ ప్రముఖ హీరో వరుణ్ ధావన్.. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Varun Dhawan Disease: బాలీవుడ్‌ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లను ఆపేశారు. ఆయన వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆయన జగ్‌జగ్ జీయో షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌కు వెళ్లడం మానేసిట్లు చెప్పారు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ కారణంగా ప్రాథమికంగా బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కష్టపడుతున్నట్లు వివరించారు. అందరం రేస్‌లో పరిగెడుతున్నామని, ఎవ్వరూ ఎందుకని ప్రశ్నించుకోరని చెప్పారు.

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏంటి?
పెరిఫెరల్‌ లేదా సెంట్రల్‌ వెస్టిబ్యులర్‌ సిస్టమ్‌ పాక్షికంగా లేదా పూర్తిగా పనిచేయకపోవడాన్ని వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అని పిలుస్తారు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌కు కారణాలు జన్యుపరమైనవి కావచ్చు. లేదా న్యూరోడెజెనరేటివ్, టాక్సిక్, వైరల్ లేదా ట్రామాటిక్‌ కారణాలతో సంభవించవచ్చు. ఎముక, మృదులాస్థి ద్వారా చెవి నిర్మాణమవుతుంది. అక్కడ ద్రవంతో నిండిన సెమికర్యులర్ ఛానల్ ఉంటుంది. కదులుతున్నప్పుడు ఈఈ ద్రవం స్థానం మారుతూ ఉంటుంది.

మెదడు చెవిలోని సెన్సార్ ద్వారా డేటాను స్వీకరిస్తుంది. ఇది శరీరం బ్యాలెన్స్‌డ్‌గా ఉండేదుకు సహాయపడుతుంది. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌లో బ్యాలెన్స్‌ గతితప్పడానికి లోపలి చెవి భాగం కారణమవుతుంది. ఇది తల ఒక వైపు (యూనిలేటరల్‌ హైపోఫంక్షన్) లేదా రెండు వైపులా ప్రభావితం చేయవచ్చు. ఇది ప్రత్యక్ష, పరోక్ష మార్గాలలో రోజువారీ జీవితాన్ని, పనితీరును ప్రభావితం చేస్తుంది. లోపలి చెవిలో కొంత భాగం పనిచేయనప్పుడు, తప్పుడు సందేశాలు మెదడుకు చేరడం వల్ల ఈ లక్షణాలు ఎదురవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.