ETV Bharat / entertainment

'నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై రుద్దను'

author img

By

Published : Oct 31, 2022, 7:23 AM IST

అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్​ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 'ఊర్వసివో రాక్షసివో' సినిమా ట్రైలర్ బాగుందని.. సినిమా కలర్​ఫుల్​గా కనిపిస్తోందని బాలయ్య ప్రశంసించారు. తనకు ఇలాంటి చిత్రాలు చేయాలని ఉందని చెప్పారు. తన అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోనని బాలకృష్ణ తెలిపారు.

urvasivo rakshasivo movie pre release event
ఊర్వశివో రాక్షసివో చిత్ర విడుదల ముందస్తు వేడుక

"మనిషి తన దైనందిన జీవితంలో అన్నవస్త్రాలతో పాటు వినోదాన్నీ ఓ సాధనంగా ఎంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సినిమాలు అందించాలి అన్నది పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి" అన్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. రాకేష్‌ శశి తెరకెక్కించారు. ధీరజ్‌ మొగిలినేని, విజయ్‌.ఎమ్‌ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. నవంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "ట్రైలర్‌ బాగుంది. సినిమా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నాకూ ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా పరిమితులు నాకున్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోను. ఈ సినిమా విజయవంతమవుతుందని నమ్ముతున్నా" అన్నారు.

"మా నాన్నతో రెండు సినిమాలు చేశా. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు'. రెండూ పెద్ద హిట్టయ్యాయి. ఈ మూడో చిత్రమూ అదే తరహాలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌లోని నటిని అందరూ చూస్తారు. దర్శకుడు రాకేష్‌ పైకి నెమ్మదిస్తుడిలా కనిపిస్తాడు కానీ, పెద్ద పని రాక్షసుడు" అన్నారు హీరో అల్లు శిరీష్‌.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. "ప్రస్తుతం యువతరం ఎదుర్కొంటున్న ఓ సమస్య ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రమిది. మంచి వినోదం ఉంది. రాకేష్‌ చక్కగా తెరకెక్కించారు" అన్నారు. "దర్శకుడు రాకేష్‌ ఈ కథతో నన్ను కలిసినప్పుడే నిర్ణయించుకున్నా.. ఈ చిత్రం నేను కచ్చితంగా చేయాలని. తనకీ కథపై ఉన్న నమ్మకం అలాంటిది. ఇది చాలా మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. అందరూ థియేటర్లలో చూసి ఆనందించండి" అంది అను ఇమ్మాన్యుయేల్‌. "అల్లు శిరీష్‌కి నాకు కొన్నేళ్లుగా మంచి అనుబంధం ఉంది. ఈ చిత్రానికి ముందుకు మేము కొన్ని కథలు అనుకున్నా కుదర్లేదు. ఇన్నేళ్లకు ఈ చిత్రంతో అది సాధ్యమైంది. ఇది మా కాంబినేషన్‌లో బెస్ట్‌ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నా. ఈ చిత్రం కోసం శిరీష్‌ తనని తాను ఎంతగా మార్చుకున్నాడన్నది టీజర్‌, ట్రైలర్స్‌ చూస్తేనే అర్థమవుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌ల వల్లే ఈ సినిమా చాలా సాఫీగా సాగిపోయింది" అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో మారుతి, వెంకటేష్‌ మహా, పరశురామ్‌, చందూ మొండేటి, వశిష్ఠ, సునీల్‌, తన్వీర్‌, అచ్చు రాజమణి, సాయి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: ఆ సినిమా రిలీజ్​ కాకముందే.. 30కోట్లు లాభం?

పోలాండ్​లో 'ఈగల్'​ మూవీ షూటింగ్.. అనుపమ, కావ్యతో రవితేజ రొమాన్స్​!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.