ETV Bharat / entertainment

వెంకీ మామ షాకింగ్​ నిర్ణయం​.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం!.. ఎందుకంటే?

author img

By

Published : Nov 13, 2022, 6:08 PM IST

టాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేశ్​ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఎందుకంటే..

victory venkatesh shocking decision
victory venkatesh shocking decision

టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్​.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా గల నటుడు. తన నటనతో చాలా మంది లేడీ ఫ్యాన్స్​ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇక నుంచి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే ప్రాజెక్టులకూ ఓకే చెప్పడం లేదంట.

వెంకటేశ్ నటించిన 'ఎఫ్ 3' మూవీ ఈ ఏడాది మేలో విడుదలైంది. అప్పటి నుంచి వెంకటేశ్​ సినిమాల గురించి ఎటువంటి అప్డేట్లు లేవు. మరోవైపు, వెంకీ మామ సహచర నటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకుల మందుకు వస్తున్నారు. కాగా, బాబాయ్​ వెంకటేశ్, అబ్బాయి రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' త్వరలోనే నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అయితే వెంకటేశ్​కు ఆధ్యాత్మిక భావాలు కాస్త ఎక్కువే. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని కొద్దిరోజుల పాటు ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి : ఆ బంధాల కంటే ఒంటరిగా ఉండడమే హ్యాపీ అంటున్న సదా

బాలీవుడ్​ హిట్​ సాంగ్​కు స్టెప్పులతో అదరగొట్టిన చరణ్​-అక్షయ్​.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.