ETV Bharat / entertainment

ఇట్స్​ అఫీషియల్.. నాలుగేళ్ల తర్వాత రానున్న 'ఇస్మార్ట్'​ కాంబో!

author img

By

Published : May 13, 2023, 8:34 PM IST

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో మరో మూవీ రానుంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్​ వెల్లడించింది. ఆ వివరాలు..

puri jagannadh next movie officially announced
puri jagannadh next movie with ram officially announced

గతంలో కాలంలో మాస్​ ఆడియన్స్​కు కనెక్ట్​ అయ్యేలా సినిమలు తీసి బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​ బస్టర్లు​ అందుకున్నారు స్టార్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. లైగర్ సినిమా పరాజయం తర్వాత ఈయన ఏ హీరోతో సినిమా తీస్తాడన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి రేగింది. ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్​మెంట్​ ఇవ్వలేదు. కానీ వరుస పరాజయాలను మూటగట్టుకున్న పూరీ కెరీర్​కు ఊపు తీసుకొచ్చిన చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. ఎనర్జిటీక్​ హీరో రామ్‌ పోతినేని కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. రామ్‌ యాక్టింగ్​తో పాటు, పూరి డైరెక్షన్​ మాస్‌ ఆడియెన్స్​ను మెప్పించాయి.

ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా రాబోతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిత్ర నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్స్‌ ఈ స్పెషల్‌ అప్‌డేట్‌ను ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకుంది. "నాలుగేళ్ల తర్వాత ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కలిసి పనిచేయబోతున్నారు. దిమాక్‌ ఖరాబ్‌ అనౌన్స్‌మెంట్‌" అంటూ కొత్త మూవీకి సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలియజేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అటు రామ్​ ఫ్యాన్స్​తో పాటు పూరీ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ కొత్త అనౌన్స్​మెంట్​ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

కాగా 2019లో విడుదలైన ఈ సినిమాను పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. దాదాపు 16 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్​ వద్ద 80 కోట్ల మేర వసూళ్లు చేసి సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. క్యూట్​ లుక్స్​తో అమ్మాయిల మనసులు దోచుకునే రామ్​.. ఈ సినిమాలో ఊర మాస్​ అవతారమెత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్స్​ నభా నటేశ్​, నిధి అగర్వాల్​ తమ యాక్టింగ్​తో అదరగొట్టారు. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్​గా నిలిచింది.

మరోవైపు రామ్​ పోతినేని ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్​ సరసన యంగ్​ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. మాస్ యాక్షన్​ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్​ చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.