ETV Bharat / entertainment

SSMb 28కు భారీగా ఆఫర్లు.. అప్పుడే వందల కోట్ల బిజినెస్​.. ఎంతంటే?

author img

By

Published : Feb 2, 2023, 4:48 PM IST

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు -త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా SSMB28 ప్రీ రిలీజ్ బిజినెస్​ అప్పుడే భారీగా జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్​, శాటిలైట్​, థియేట్రికల్​ రైట్స్​ అన్ని కలిపి ఎంతకు అమ్ముడుపోయాయంటే?

SSMb 28 Digital satellite  and theatrical rights RS 300 crores
SSMb 28కు భారీగా ఆఫర్లు.. అప్పుడే వందల కోట్ల బిజినెస్​.. ఎంతంటే?

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు -త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా SSMB28. ఈ చిత్రం అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్​ కూడా పూర్తి చేసుకోలేదు కానీ అప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్​ భారీగా చేస్తేస్తోంది. ఈ చిత్ర డిజిటల్​ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.80 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వార్తా బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్​ రైట్స్​ మొత్తం కలిపి రూ.100కోట్లకు కొనుగోలు అయ్యాయట. ఇక థియేట్రికల్​ బిజినెస్​ దాదాపు రూ.200కోట్ల వరకు జరిగిందని తెలిసింది. దీంతో మొత్తంగా రూ.300కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు పోయాయని సమాచారం. ఇక ఈ చిత్రం బ్రెక్​ ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లు ఉండొచ్చని అంచనా.

కాగా, ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్​గా నటిస్తున్నారు. మహేశ్‌తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు కూడా ఇది తొలి పాన్‌ ఇండియా సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి ఇంత భారీగా ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ఇన్​ఫర్మేషన్​ లేదు. కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. ఇక ఈ చిత్రం తర్వాత మహేశ్‌ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్​ సీసీఏ క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీతో జక్కన్న అగ్రీమెంట్​ చేసుకున్నారు.

ఇదీ చూడండి: ఇలియానాకు ఆ సమస్య క్లియర్​ అయినట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.