ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్'​ సీక్వెల్​పై మాట్లాడిన జక్కన్న .. సూపర్​ ఐడియా వచ్చిందట

author img

By

Published : Dec 13, 2022, 5:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్​పై మాట్లాడారు దర్శకుడు రాజమౌళి. ఏం అన్నారంటే..

SS Rajamouli RRR sequel
SS Rajamouli RRR sequel

తెలుగుతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అయితే తాజాగా మరోసారి ఈ చిత్ర సీక్వెల్​పై మాట్లాడారు జక్కన్న.

"ఆర్​ఆర్​ఆర్​ సీక్వెల్ మీద కసరత్తులు జరుగుతున్నాయి. మొదట్లో రెండో భాగం గురించి ఆలోచించినప్పుడు మంచి ఐడియాలు వచ్చాయి. కానీ గొప్ప ఆలోచనలు రాలేదు. అయితే కొద్ది వారాల క్రితం మాత్రం ఓ గొప్ప ఆలోచన తట్టింది. ప్రస్తుతం దాని అమలు చేసే పనిలో ఉన్నాం. స్క్రిప్ట్​ వర్క్​ చేస్తున్నాం. అది సక్సెస్​ఫుల్​గా పూర్తైతే అప్పుడు స్వీక్వెల్​ గురించి మాట్లాడతాను" అని జక్కన్న అన్నారు.

అలాగే తన విజయ రహస్యం గురించి కూడా చెప్పారు రాజమౌళి. "విజయానికంటూ విడిగా రహస్యామేమి ఉండదు. కానీ రెండు విషయాలు చెబుతాను. మొదట ప్రేక్షకులతో అనుబంధం ఉండాలి. ఆడియన్స్‌ పల్స్‌ తెలుసుకోవాలి. ఇక రెండోది కష్టపడడం. ఎంత కష్టపడితే విజయాన్ని అంత ఆస్వాదిస్తారు. సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తే ఆ సమయంలో పొందే ఆత్మ సంతృప్తి వర్ణించడానికి మాటలు చాలవు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఒక సినిమా తీయడం ప్రారంభించినప్పుడు అందరికీ సందేహాలు వస్తాయి. ఎందుకంటే ఫిల్మ్‌ మేకింగ్‌ అనేది చాలా మంది మనసులతో ముడిపడిన ప్రక్రియ. ఇది విజయం సాధిస్తుందా.. లేదా అనే సందేహం వస్తుంది. ఎన్ని సందేహాలు ఉన్నా.. ఉత్సాహంతో పనిచేస్తుండాలి" అని రాజమౌళి పేర్కొన్నారు.

ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ సమయంలో మీకు నిద్రలేని రాత్రులు ఉన్నాయా ..? అని ప్రశ్నించగా.. "జూనియర్‌ ఎన్టీఆర్‌తో యానిమల్‌ సీక్వెన్స్‌ని షూట్‌ చేస్తున్నప్పుడు మాత్రమే మేమంతా నిద్రలేని రాత్రులు గడిపాం. ఎందుకంటే అది రాత్రి సమయంలోనే చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కాబట్టి.." అని జక్కన్న చమత్కరించారు.

SS Rajamouli RRR sequel
'ఆర్​ఆర్​ఆర్'​ సీక్వెల్​పై స్పందించిన జక్కన్న

ఇదీ చూడండి: అవకాశం వస్తే.. పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటిస్తా: స్టార్‌ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.