ETV Bharat / entertainment

రాజమౌళి మాత్రమే కాదు.. RRRకు ఆస్కార్ వెనక మరో మాస్టర్ మైండ్ అతడే

author img

By

Published : Mar 14, 2023, 7:10 AM IST

Updated : Mar 14, 2023, 7:32 AM IST

RRR ఆస్కార్
RRR ఆస్కార్

'ఆర్​ఆర్​ఆర్​'కు ప్రతిష్టాత్మక ఆస్కార్ ​అవార్డు దక్కడంతో యావత్​ భారత సినీ అభిమానులు ఎంతగానో సంతోషపడుతున్నారు. మరి ఈ చిత్రానికి ఆస్కార్​ రావడానికి వెనక ఓ మాస్టర్​ మైండ్​ ఉందని మీకు తెలుసా? అది దర్శకుడు రాజమౌళి కాదు. మరో పేరు దాగి ఉంది. దాని గురించే ఈ కథనం..

యావత్​ భారతావని కోరుకున్నట్టే ఆస్కార్​ అవార్డ్ 'ఆర్​ఆర్​ఆర్'​కు వచ్చేసింది. ఈ అద్భుతమైన ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా టాలీవుడ్​ టు బాలీవుడ్​ ప్రతి ఒక్కరూ ఆర్​ఆర్​ఆర్​ టీమ్​.. హీరోస్​ ఎన్టీఆర్-రామ్ చరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్-కాలభైరవ, సంగీత దర్శకుడు కీరవాణి, లిరికిస్ట్​ చంద్రబోస్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళిని.. ఇండియన్​ సినిమా సత్తా చూపించారు అంటూ తెగ పొగిడేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆర్ఆర్ఆర్ టీమ్ పేర్లను జపిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ మనకు దక్కడానికి వెనక ఓ మాస్టర్​ మైండ్​ ఉందట. అతని పేరే ఎస్​ఎస్​ కార్తికేయ. ఆయన మరెవరో కాదు. జక్కన్న సినిమాలు, ఫ్యామిలీ గురించి తెలిసినోళ్లకు కార్తికేయ దాదాపుగా తెలుసు. కానీ సినీ ప్రేక్షకులందరికీ అతను పెద్దగా తెలియకపోవచ్చు. ఈయన వల్లే ఆస్కార్​ సాధ్యమైందని అంటున్నారు. అసలు ఈయనకి.. ఆస్కార్ రావడానికి కారణమేంటంటే..

లాస్ ఏంజెల్స్​లో ఎంతో ఘనంగా ఆస్కార్ అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్​ డైరెక్టర్​ కీరవాణి, లిరికిస్ట్​ చంద్రబోస్ ఈ అవార్డును స్వీకరించారు. స్టేజీపై కీరవాణి మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళితో పాటు కార్తికేయకు మాత్రమే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో చాలా మంది సినీ ఆడియెన్స్​ కార్తికేయ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఆయన రమా రాజమౌళి.. ఆమె మొదటి భర్తకు జన్మించారు. ఆ తర్వాత రమని వివాహం చేసుకున్న జక్కన్న.. కార్తికేయని సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. వీరిద్దరు ఎంతో ప్రేమగా ఉంటారు. కొంతకాలం పాటు టెక్నీషియన్​గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం లైన్ ప్రొడ్యూసర్​గా ఉంటున్నారు.

'బాహుబలి'కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఆయనే కారణం అంటుంటారు. మార్కెటింగ్, ప్రమోషన్స్ విషయాలన్ని ఆయనే చూసుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్'కు కూడా కథ దగ్గర నుంచి ఆస్కార్ దక్కించుకోవడం వరకు ప్రతీది ఆయనే దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారట. ముఖ్యంగా ఈ భారీ చిత్రానికి.. ఇతర దేశాల్లో మార్కెటింగ్, సినిమా ప్రదర్శన, ఖర్చులు, అసలు ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లేళా పక్కా ప్లానింగ్ చేసిందంటా ఆయనేనట. నిజానికి ఆర్​ఆర్​ఆర్​ను ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం నుంచి జ్యూరీ పంపలేదు. దాంతో ఆస్కార్ ఆశలు ఆవిరైపోయాయని తెలుగు ఆడియెన్స్​ బాగా బాధపడ్డారు.

అప్పుడు కార్తికేయ రంగంలోకి దిగారు. వేరియన్స్ ఫిల్మ్స్ సాయంతో ఆస్కార్​కు ఆర్​ఆర్​ఆర్​ను పంపడానికి కావాల్సిన అన్ని అర్హతలను సాధించారు. అలా అమెరికా, జపాన్ లాంటి పెద్ద దేశాల్లో స్క్రీనింగ్, భారీ ప్రమోషన్స్​ను.. ఇలా ప్రతీ విషయాన్ని దగ్గరుండి మరి ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. అలా ఆస్కార్ విషయంలో ఆర్​ఆర్​ఆర్​ టీమ్ మనకు కంటి ముందు కనపడితే... ఆయన మాత్రం తెర వెనక ఉంటూ ఈ ప్రక్రియను అంతా నడిపించారు. ఎట్టకేలకు కోట్ల మంది కలను నెరవేర్చారు. అందుకే కీరవాణి.. కార్తికేయ పేరును ఆస్కార్ స్టేజ్​పై ప్రత్యేకంగా ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపారు. అందుకే నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆస్కార్ ప్రకటించిన వెంటనే కార్తికేయను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఆస్కార్ వెనక కార్తికేయ భారీ కష్టం దాగి ఉందని అన్నారు. అలా మొత్తానికి ఆర్​ఆర్​ఆర్​కు ఆస్కార్​ దక్కడానికి కార్తికేయ చాలా కష్టపడ్డారన్నమాట.

oscar RRR
కార్తికేయ

ఇదీ చూడండి: 'ఆస్కార్' గిఫ్ట్ బ్యాగ్‌లో అంత కాస్ట్లీ బహుమతులు ఉంటాయా? భలే ఛాన్స్​ కదా!

Last Updated :Mar 14, 2023, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.