ETV Bharat / entertainment

అవకాశాలొచ్చినా శ్రీలీలకు కలిసిరాని 2023!- హోప్స్​ అన్నీ ఆ సినిమాలపైనే

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 9:09 AM IST

Updated : Dec 27, 2023, 11:40 AM IST

Sreeleela 2023 Movies : 2023 తెలుగు సినీఇండస్ట్రీలో శ్రీలీల పేరు మార్మోగిపోయింది. దాదాపు పెద్ద ప్రాజెక్ట్​లు అన్నింటిలోనూ ఈ బ్యూటీదే లీడ్ రోల్. టాలీవుడ్​లో ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిందీ భామ. కానీ, ఆయా సినిమాల ఫలితాల వల్ల ఈ ముద్దుగుమ్మకు కాస్త నిరాశ ఎదురైందనే చెప్పాలి.

Sreeleela 2023 Movies
Sreeleela 2023 Movies

Sreeleela 2023 Movies : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యింది. గతేడాది మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' సినిమాతో కెరీర్​లో తొలి హిట్​ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత, వరుస ఆఫర్లు దక్కించుకొని మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్​గా మారింది. ఈ ఏడాదంతా శ్రీలీల చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిందనే చెప్పాలి.

స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ పట్టేసిన శ్రీలీల ఈ ఏడాది ఏకంగా నాలుగు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'స్కంద'లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జంటగా నటించిందీ ముద్దుగుమ్మ. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్​లో విడుదలైన ఈ మూవీ మిక్స్​డ్ టాక్​ అందుకుంది.

ఆ సినిమాతో అదుర్స్ : శ్రీలీల ఈ ఏడాది తన రెండో సినిమా 'భగవంత్ కేసరి' సినిమాతో హిట్ అందుకుంది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మళ్లీ నిరాశ : ఇక నవంబర్​లో మెగాహీరో వైష్ణవ్​తేజ్ సరనస 'ఆదికేశవ' సినిమా, యంగ్ హీరో నితిన్ 'ఎక్స్​ట్రా ఆర్డినరీమ్యాన్' మూవీలో లీడ్​ రోల్​లో నటించింది శ్రీలీల. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు. దీంతో యంగ్​బ్యూటీకి మళ్లీ నిరాశ ఎదురైంది.

హోప్స్ వాటిపైనే! : సూపర్​స్టార్ మహేశ్​బాబు 'గుంటూరు కారం' సినిమాతో శ్రీలీల 15 రోజుల్లో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీలీలకు మంచి క్రేజ్ రావచ్చని ఇన్​సైట్ టాక్. మరోవైపు పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్​సింగ్' సినిమాలో నటిస్తోందీ భామ. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా 2024లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల- తన టార్గెట్​ కోసమేనట!

ఏంటి బెంగళూరులో శ్రీలీల హాస్పిటల్ స్టార్ట్ చేస్తుందా? నిజమేనా?

Last Updated :Dec 27, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.