ETV Bharat / entertainment

ప్రభాస్‌ కోసం ఓ థియేటర్‌?.. షారుక్‌ యాక్షన్‌ మెరుపులు.. బ్రూస్‌లీగా దర్శకుడి తనయుడు

author img

By

Published : Dec 2, 2022, 8:01 AM IST

Updated : Dec 2, 2022, 11:23 AM IST

ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ కోసమే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పాతకాలం నాటి సినిమా థియేటర్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు 'పఠాన్‌' టీజర్‌ విడుదలయ్యాక ఆ సినిమాపై మరిన్ని ఆశలు పెంచుకున్నారు షారుక్‌ ఖాన్‌ అభిమానులు. షారుక్‌ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని తరహాలో యాక్షన్‌తో ఈ చిత్రంలో మెరిపిస్తారని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Theater for Prabhas movie updates
విభిన్న చిత్రాలతో అలరించనున్న నటులు

ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్‌, మాళవికా మోహన్‌, రిద్ది కుమార్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈనెల రెండో వారం నుంచి మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనుందని సమాచారం. ఇందుకోసం ప్రభాస్‌ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనతో పాటు కథానాయికలపై లుక్‌ టెస్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ కోసమే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పాతకాలం నాటి సినిమా థియేటర్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అందులోనే ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్‌. ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

రామ్‌ పోరాటం..
రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా రామ్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్ర పరిచయ సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట ఘట్టమిది. దీనికి స్టంట్‌ శివ నేతృత్వం వహిస్తున్నట్లు తెలిసింది. దాదాపు నెల రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా - తెలంగాణ నేపథ్యాల్లో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Theater for Prabhas movie updates
రామ్

పఠాన్‌ యాక్షన్‌ మెరుపులు..
‘పఠాన్‌’ టీజర్‌ విడుదలయ్యాకా ఆ సినిమాపై మరిన్ని ఆశలు పెంచుకున్నారు షారుక్‌ ఖాన్‌ అభిమానులు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. ఇందులో నాయికగా దీపికా పదుకొణె, విలన్‌గా జాన్‌ అబ్రహం నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో షారుక్‌, దీపిక, జాన్‌..ముగ్గురూ గన్‌లు పట్టుకొని ఉన్నారు. దీనికి నెటిజన్లు లెజెండ్‌ తిరిగొచ్చాడు, కింగ్‌ ఖాన్‌ వచ్చాడు అంటూ స్పందిస్తున్నారు. షారుక్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ చూడని తరహాలో యాక్షన్‌తో మెరిపిస్తారని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Theater for Prabhas movie updates
దీపికా పదుకొణె, షారుక్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహం

యోధుడు సిద్ధమయ్యాడు..
‘షేర్షా’ చిత్రంలో కెప్టెన్‌ విక్రమ్‌ బత్రాగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్ధార్థ్‌ మల్హోత్ర. ధైర్యం నిండిన ఆర్మీ అధికారిగా అదరగొట్టిన సిద్ధార్థ్‌ మరోసారి గన్‌పట్టి యాక్షన్‌ సత్తా చూపించబోతున్నాడు. కరణ్‌జోహార్‌ దర్శకత్వంతో వస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జులై7న విడుదల చేయనున్నట్లు గురువారం చిత్రబృందం ప్రకటించింది. సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ, రాశీ ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరితో నటించడం సిద్ధార్థ్‌కు ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం నాయికలిద్దరూ ప్రత్యేకంగా కష్టపడ్డారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరో తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాత కరణ్‌ జోహార్‌.

Theater for Prabhas movie updates
సిద్ధార్థ్‌ మల్హోత్ర

బ్రూస్‌లీ..
యాక్షన్‌ సినిమా ప్రియులు మర్చిపోలేని పేరు. నటుడి గానే కాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం సాధించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ లెజెండరీ నటుడి జీవితం వెండితెరకు రాబోతుంది. దీనికి ప్రముఖ దర్శకుడు యాంగ్‌ లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘బ్రోక్‌ బ్యాక్‌ మౌంటైన్‌’ చిత్రాలతో ఆస్కార్‌ పురస్కారాలు గెలుచుకున్నారు. ఇప్పుడు బ్రూస్‌లీగా యాంగ్‌లీ తనయుడు మాసన్‌లీ నటిస్తున్నాడు ‘‘తన నిరంతరశ్రమతో అసాధ్యాలు ఎన్నింటినో సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరకి తీసుకురావడం ఆనందంగా ఉంది’’అని చెప్పారు యాంగ్‌లీ. ‘లాంగ్‌ హాఫ్‌ టైమ్‌ వాక్‌’, ‘ది హ్యాంగోవర్‌ పార్ట్‌ 2’, ‘స్టాండ్‌ బై మీ’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు మాసన్‌లీ.

Theater for Prabhas movie updates
మాసన్ లీ
Last Updated : Dec 2, 2022, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.