ETV Bharat / entertainment

SIIMA 2022: అదరగొట్టిన 'పుష్ప'.. టాలీవుడ్​కు వచ్చిన అవార్డులివే

author img

By

Published : Sep 11, 2022, 11:08 AM IST

Updated : Sep 11, 2022, 3:01 PM IST

గ్రాండ్​గా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవంలో అల్లుఅర్జున్​కు బెస్ట్ యాక్టర్​ అవార్డు వరించింది. ఇంకా ఎవరెవరికి ఏఏ పురస్కారాలు దక్కాయో తెలుసుకుందాం.

PUSHPA SIIMA AWARDS
పుష్ప సైమా అవార్డ్స్​

దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చెందిన పలువురు స్టార్స్​ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. కాగా, ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పుష్ప చిత్రం జోరు చూపించింది. దాదాపు ఆరు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఇంకా ఏఏ చిత్రానికి, ఎవరెవరికి పురస్కారాలు వచ్చాయో తెలుసుకుందాం..

  • ఉత్తమ చిత్రం: పుష్ప: ది రైజ్
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ నటి: పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)
  • ఉత్తమ సహాయ నటుడు: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)
  • ఉత్తమ సంగీత స్వరకర్త: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిరియాల (చిట్టి – జాతి రత్నాలు)
  • ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (జై బాలయ్య – అఖండ)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)
  • ఉత్తమ తొలి నటుడు: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
  • ఉత్తమ తొలి నటి: కృతి శెట్టి (ఉప్పెన)
  • ఉత్తమ నూతన దర్శకుడు: బుచ్చి బాబు సన (ఉప్పెన)
  • ఉత్తమ తొలి నిర్మాత: సతీష్ వెగ్నేస (నాంది)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)
  • ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)

ఇదీ చూడండి: రాజకీయాల్లోనూ 'రెబల్' ముద్ర.. వాజ్​పేయీ హయాంలో కేంద్రమంత్రిగా..

Last Updated :Sep 11, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.