ETV Bharat / entertainment

సిద్ధు జొన్నలగడ్డ యూటర్న్​.. చిరుకు హ్యాండ్​ ఇచ్చాడుగా..

author img

By

Published : Jul 11, 2023, 2:58 PM IST

Siddhu Jonnalagadda chiranjeevi movie
Siddhu Jonnalagadda chiranjeevi movie

'డీజే టిల్లు' సినిమాతో యూత్​లో ఫుల్ పాపులారిటీ సంపాదించున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ... మెగాస్టార్ చిరంజీవికి హ్యాండ్ ఇచ్చారని తెలిసింది. ఆ వివరాలు...

Chiranjeevi Siddu Jonnalagadda Movie : 'డీజే టిల్లు'తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ప్రస్తుతం ఆ సినిమా విజయంతో ఫుల్​ జోష్​లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిట్​తో ఈ హీరోకు టాలీవుడ్​లో మంచి బ్రేక్​ వచ్చింది. 'గుంటూరు టాకీస్‌', 'కృష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింతగాథ వినుమా' వంటి చిత్రాలతో కాస్త గుర్తింపు పొందిన సిద్ధు.. ఆ తర్వాత 'డీజే టిల్లు'తో భారీ హిట్​ను అందుకుని క్రేజ్​ను దక్కించుకున్నాడు. యూత్​లో ఫుల్ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నాడు.

ఈ క్రమంలోనే సిద్ధు.. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న కొత్త సినిమాలో నటించే ఛాన్స్​ అందుకున్నాడని వార్తలు వచ్చాయి. 'బంగార్రాజు' ఫేమ్​ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'బంగార్రాజు' లాంటి హిట్​ చిత్రం తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటం, అందులోనూ మెగాస్టార్ కూడా ఈ సినిమాలో రోల్​ చేస్తుండటం వల్ల.. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో చిరు కొడుకు పాత్రలో సిద్ధు నటించనున్నాడని అంతా అన్నారు కూడా. అంతే కాకుండా ఈ సినిమాలో నటించేందకు సిద్ధు ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నాడన్న ప్రచారం కూడా జోరుగా సాగింది.

Siddu Jonnalagadda Movies : అయితే ఇప్పుడు మరో షాకింగ్ వార్త తెరపైకి వచ్చింది. సిద్ధు.. ఈ పాత్రలో చేయడానికి సుముఖంగా లేడని తెలిసింది. సెకండ్​ లీడ్​ రోల్స్​ వద్దనుకున్నాడట. మెయిన్​ లీడ్ రోల్స్​ చేయాలని అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో దర్శకుడు కల్యాణ్ కృష్ణ.. సిద్ధు స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో హీరో కోసం వెతికే పనిలో పడ్డారని తెలిసింది. ఈ క్రమంలో పలువురు హీరోల పేర్లను పరిశీలిస్తున్నారట్లు టాక్​ కూడా నడుస్తోంది. చూడాలి మరి సిద్ధు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో, ఏ హీరో నటిస్తారో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తాజాగా 'టిల్లు స్కేర్' అనే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ నటించాడు. మరోవైపు చిరంజీవి కూడా 'భోళా శంకర్'​ సినిమా చిత్రీకరణను ముగించి ఫారిన్ టూర్​కు వెళ్లారు. వీరిద్దరి సినిమాలు తర్వలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. 'భోళా శంకర్'​ ఆగస్టు 11న రిలీజ్​ కానుండగా.. 'టిల్లు స్కేర్'​..సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.