ETV Bharat / entertainment

పఠాన్​ కోసం షారుక్​ అదిరిపోయే స్కెచ్​, బాయ్​కాట్​ నుంచి తప్పించుకుంటారా

author img

By

Published : Aug 30, 2022, 7:21 AM IST

బాయ్​కాట్ సెగ నుంచి తప్పించుకోవడానికి బాలీవుడ్​ బాద్​ షా షారుక్​ ఖాన్​ ఓ సూపర్​ ప్లాన్​ వేశారు. తన తాజా చిత్రం పఠాన్​ కోసం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.

sharukh khan pathan
షారుక్​ ఖాన్ పఠాన్​

Sharukhkhan Pathan promotions బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం పఠాన్. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. దాదాపు రూ.250కోట్లతో రూపొందుతున్న ఈ యాక్షన్‌ డ్రామా చిత్రానికి ఇప్పటినుంచే ప్రచారం నిర్వహించాల్సిందిగా చిత్ర యూనిట్ కోరగా షారుక్​ నిరాకరించారట. కారణం ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తున్న బాయ్‌కాట్‌ ట్రెండ్‌.

ఇప్పటికే పలు బాలీవుడ్ అగ్రనటుల సినిమాలు ఈ బాయ్‌కట్ ట్రెండ్‌కి గురవ్వగా, దీనిని హెచ్చరికగా తీసుకున్న షారుక్​ 'పఠాన్‌' విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 'బాయ్‌కాట్‌ పఠాన్‌' హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటినుంచే ఈ సినిమాపై బాయ్‌కాట్‌ ట్రెండ్ మొదలవ్వగా, ఇక ప్రచారం మొదలైతే అది తీవ్రమయ్యే ప్రమాదం ఉందని షారుఖ్‌ భావిస్తున్నారట. ఏ సమయంలో ‘పఠాన్‌’ ప్రచారం ప్రారంభించాలి? ఏ విధంగా చేయాలి? అనే విషయంపై చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఆమీర్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, రణబీర్‌కపూర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర నష్టాలను చవి చూశాయి. మరోవైపు 'పఠాన్‌' హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది. ఇంకా షారుక్‌ చిత్రాలు జవాన్, డంకీ వచ్చే ఏడాదే విడుదల కానున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: వైష్ణవ్​తేజ్​ నేను అలా చేసేవాళ్లం, ఆ అనుభవాలు అద్భుతం అంటున్న కేతికశర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.