ETV Bharat / entertainment

'దళపతి 67'లో కేజీయఫ్ విలన్​​.. హీరోయిన్​గా త్రిష ఫిక్స్​

author img

By

Published : Jan 31, 2023, 4:16 PM IST

లోకేష్​ కనగరాజ్​-విజయ్​ కాంబోలో రూపొందుతన్న దళపతి 67లో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్​ నటించనున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్​గా త్రిష, మరో కీలక పాత్రలో అర్జున్​ నటించనున్నట్లు వెల్లడించారు మేకర్స్​.

Thalapathy 67
'దళపతి 67'లో కేజీయఫ్ విలన్​​.. హీరోయిన్​గా త్రిష ఫిక్స్​

మాస్టర్‌ చిత్రంతో తమిళ స్టార్ హీరో విజయ్‌ - దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో సూపర్​ క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో దళపతి 67 రూపొందనుంది. అయితే దానిపై నిర్మాణ సంస్థ 7 స్క్రీన్‌ స్టూడియో సోమవారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సంజయ్​ దత్​ నటిస్తారనే వార్త కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు మూవీ టీమ్​ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటే ఇతర నటీనటుల వివరాలను తెలియజేసింది. హీరోయిన్​గా ​ త్రిష నటించనుంది. యాక్షన్​ హీరో అర్జున్ మరో కీలక పాత్ర పోషించనున్నారు. ఇంకా మిస్కిన్​, జీవీఎమ్​, ప్రియా ఆనంద్​ తదితురులు నటించనున్నారు.

ఇకపోతే 'కత్తి', 'మాస్టర్‌', 'బీస్ట్‌' తర్వాత విజయ్‌- సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌లో కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, యాక్షన్‌: అన్బరివ్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌రాజ్‌, కొరియోగ్రఫీ: దినేశ్‌, సంభాషణలు: లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, దీరజ్‌ వైదీ. కాగా, కమల్‌హాసన్‌ హీరోగా గతేడాది తాను తెరకెక్కించిన విక్రమ్‌తో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అందులో భాగం చేస్తారా, లేదా? వేచి చూడాల్సిందే.

Thalapathy 67
'దళపతి 67'లో కేజీయఫ్ విలన్​​

ఇదీ చూడండి: వరుణ్​ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ​.. వధువు ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.