ETV Bharat / entertainment

ఆ సినిమా కోసం సమంత అంత రిస్క్‌ చేసిందా?

author img

By

Published : Oct 21, 2022, 5:06 PM IST

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్​ సమంత.. ఓ చిత్రం కోసం రిస్క్​ చేసినట్లు తెలిసింది. ఏంటంటే?

samantha risk
ఆ సినిమా కోసం సమంత అంత రిస్క్‌ చేస్తోందా

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'యశోద'. ఈ చిత్రం నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. యశోద సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం చిత్రబృందం హాలీవుడ్‌ స్టంట్‌మ్యాన్‌తో సమంతకు శిక్షణ ఇప్పించారట. 'ది ఫ్యామిలీమ్యాన్‌2' కోసం పనిచేసిన యానిక్‌ బెన్‌ ఆధ్వర్యంలో యశోద చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కించారని సమాచారం.

కాగా, టీజర్‌ విడుదలైన దగ్గర నుంచే సమంత అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరి, హరీష్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక సామ్​ ప్రస్తుతం గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ప్రేమకావ్యం 'శాకుంతలం'తో పాటు, శివ నిర్వాణ దర్శకత్వంలో రానున్న 'ఖుషి'లో నటిస్తోంది.

ఇదీ చూడండి: ఆ స్టార్​ హీరోతో అనన్య షికార్లు​ ప్రేమలో పడిందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.