ETV Bharat / entertainment

Salman Khan Vishnu Vardhan : పవన్​ కల్యాణ్​ డైరెక్టర్​తో సల్మాన్​ ఖాన్ కొత్త సినిమా.. మూవీ బ్యాక్​డ్రాప్​ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 10:50 PM IST

Salman Khan Vishnu Vardhan
Salman Khan Vishnu Vardhan

Salman Khan Vishnu Vardhan : పవన్ కల్యాణ్ డైరెక్టర్​తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు..

Salman Khan Vishnu Vardhan : రీసెంట్​గా 'కిసీ కా భాయ్ కిసీ కీ' జాన్ చిత్రంతో వచ్చి తన అభిమానులను నిరాశపరిచిన బాలీవుడ్ భాయ్​ స‌ల్మాన్ ఖాన్.. ఇప్పుడు మరో కొత్త సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ పంజా సినిమా దర్శకుడు​ విష్ణు వ‌ర్ధన్​తో కలిసి పనిచేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయని సమాచారం అందింది.

త్వరలోనే ఈ చిత్రం షూటింగ్​ ప్రారంభించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మధ్యలో నుంచి సెట్స్​పైకి వెళ్తుందని అంటున్నారు. ఇక అప్పటి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. పాన్ ఇండియా స్థానంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథలో భారీ యాక్ష‌న్ ఎంటర్​టైనర్​గా రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్​ను సరికొత్త అవతారంలోనూ కనిపిస్తారని తెలుస్తోంది.

కాగా, విష్ణు వర్ధన్.. గతంలో పంజా సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ను స్టైలిష్​గా పవర్​ఫుల్​ లుక్​లో సరికొత్తగా చూపించారు. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు అంతగా ఆడలేదు. కానీ పవన్ మేనరిజం, లుక్స్​ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్​గా విష్ణు వర్ధన్​.. బాలీవుడ్​లో షేర్ షా చిత్రంతో సూపర్ హిట్​ను అందుకున్నారు. కోలీవుడ్​లోనూ పలు హిట్ సినిమాలను తెరకెక్కించి గుర్తింపు పొందారు. దీంతో ఇప్పుడు సల్మాన్​తో చేయబోయే సినిమాపై కూడా మంచి అంచనాలు క్రియేట్​ అవుతున్నాయి.

ఇకపోతే ృఈ సినిమాను ప్రముఖ నిర్మాత క‌రణ్ జోహార్ నిర్మించబోతున్నారట. గతంలో సల్మాన్​-కరణ్ జోహార్​ కాంబోలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై చిత్రం సూపర్ హిట్​గా నిలిచింది. ప్రేక్షకుల విశేష ఆదరణను దక్కించుకుంది. ఒకవేళ ఈ కొత్త సినిమా కనుక ప్రారంభమైతే.. మళ్లీ ఈ ఇద్దరు కలిసి దాదాపు 25 ఏళ్ల తర్వాత పనిచేసినట్టువుతుంది. అయితే అప్పుడు కరణ్​.. సల్మాన్​ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇప్పుడు నిర్మాతగా వ్యవహరించినట్టువుతుంది.

Salman Khan Tiger 3 Movie Release Date : సల్మాన్ త్వరలోనే టైగర్ 3 సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారు. 'ఏక్ ది టైగర్', 'టైగర్ జిందాహై' వంటి సూపర్ హిట్​ సినిమాలకు సీక్వెల్​గా ఇది రూపొందింది. ఇందులో షారుక్​ ఖాన్ గెస్ట్ రోల్​లో సందడి చేయనున్నారు. దీపావళికి ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే!

దయచేసి ఆ మెయిల్స్‌ నమ్మొద్దు.. వారిపై కఠిన చర్యలు తప్పవు: సల్మాన్ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.