ETV Bharat / entertainment

రూ.1000 కోట్ల రెమ్యునరేషన్​.. సల్మాన్​ ఖాన్​ రియాక్షన్​ ఏంటంటే?

author img

By

Published : Sep 28, 2022, 3:46 PM IST

హిందీ బిగ్​బాస్​​కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్​ ఖాన్​.. తాజా సీజన్​ కోసం దాదాపు వెయ్యి కోట్లు తీసుకోబోతున్నారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు దీనిపై స్పందించారాయన. ఏం అన్నారంటే..

salman khan 1000 crores remuneration
సల్మాన్ ఖాన్ వెయ్యి కోట్ల రెమ్యునరేషన్​

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాపులర్​ షో బిగ్‌బాస్. దాదాపు 15 సీజన్లు నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కార్యక్రమం త్వరలోనే సరికొత్త సీజన్​ను ప్రారంభించుకోనుంది. అయితే ఈ సీజన్​కు భాయ్​ రూ.1000 కోట్లు రెమ్యునరేషన్​ తీసుకోబోతున్నారనే వార్త కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై ఆయన స్పందించారు.

"నా పారితోషికం గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను రూ.1000 కోట్లు రెమ్యునిరేషన్‌ తీసుకొని ఉంటే ఇక జీవితంలో పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటా. ఎందుకంటే నాకు న్యాయపరమైన ఖర్చులు ఉన్నాయి. మీరు చెప్పే ఈ మొత్తంలో.. నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే ఈ వార్తలను ఆదాయపు పన్ను, ఈడీ కూడా చదువుతుంది"

"గతంలో చాలాసార్లు విసిగిపోయి.. ఇకపై ఈ షోని హోస్ట్‌ చేయలేనని చెప్పేశాను. వాళ్లకు వేరే ఛాయిస్‌ లేక మళ్లీ నన్నే సంప్రదించారు. ఒకవేళ ఛాయిస్‌ ఉండుంటే నన్నెప్పుడో మార్చేసేవాళ్లు. హౌస్‌లో ఉన్న సభ్యులు కొన్నిసార్లు మితిమీరి వ్యవహరించినప్పుడు నేను మధ్యలో కలగజేసుకోక తప్పదు. పలు సందర్భాల్లో సహనాన్ని కోల్పోయాను. ప్రేక్షకులకు అసలేమైందో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్లు పూర్తి ఎపిసోడ్‌ని చూడరు. కేవలం ఎడిట్‌ చేసిన వెర్షన్‌ మాత్రమే చూస్తారు. బిగ్‌బాస్‌లో వచ్చే గొడవలు, విమర్శలు నన్నెప్పుడూ ఇబ్బందిపెట్టలేదు. ఎందుకంటే నాకు వేరే సమస్యలున్నాయి" అని సల్మాన్‌ తెలిపాడు.

ఇదీ చూడండి: మళ్లీ హాట్​టాపిక్​గా సల్మాన్​ రెమ్యునరేషన్​, ఆ షోకు వెయ్యి కోట్లు పక్కానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.