ETV Bharat / entertainment

Sai Pallavi Habit : సాయి పల్లవికి విచిత్రమైన అలవాటు.. వాటితో ఏం చేస్తుందో తెలుసా?

author img

By

Published : Aug 7, 2023, 10:10 PM IST

Sai Pallavi Habit : ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసి.. కుర్రాళ్ల గుండెల్లో టెంటు వేసుకుని కూర్చొంది నటి సాయిపల్లవి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఉన్న విచిత్రమైన అలవాటు గురించి చెప్పింది ఈ బ్యూటీ. అదేంటంటే?

Etv Bharat
Etv Bharat

Sai Pallavi Habit : నేచురల్​ బ్యూటీగా తెలుగువారికి పరిచయమైంది నటి సాయిపల్లవి. అమాయక చిరునవ్వుతో కట్టిపడేసే సాయి పల్లవికి ఫ్యాన్​ బేస్​ మాములుగా లేదు. అయితే ఈ మధ్యకాంలో సాయి పల్లవి.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికి ఆమె స్పష్టమైన కారణాన్ని ఎక్కడా వెల్లడించలేదు. డాక్టర్ కావాలని కలలు కన్న సాయి పల్లవి.. సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లి డాక్టర్ వృత్తిని చేపట్టబోతోందని కూడా వార్తలు వినిపించాయి. వీటిపై కూడా ఆమె స్పందించలేదు.

Sai Pallavi Latest Interview : దక్షిణాదితోపాటు ఇతర భాషల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి తన వ్యక్తిగత జీవితంలో కూడా భిన్నంగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమెకు చెందిన ఓ వీడియో వైరల్ అయింది. ఓ సినిమా షూటింగ్​లో సాయి పల్లవి గర్భంతో ఉన్న సీన్ తీస్తున్నారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ అది సినిమాలోని సీన్ అని తెలిసి.. సైలెంట్ అయ్యారు. అయితే సాయి పల్లవి ఇటీవలే.. ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకుంది.

sai pallavi habit of eating bibhuthi
సాయి పల్లవి

'విభూతి తినడం చాలా ఇష్టం'
Sai Pallavi Variety Habit : ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు విభూతి తినడం అలవాటు అని చెప్పింది. తనకు విభూతి అంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ తన బ్యాగ్‌లో పెట్టుకుంటానని తెలిపింది. తాను తినే విభూతి మాములుది కాదని, ప్రత్యేకమైన చెక్కతో తయారు చేసిందని చెప్పింది. అది చాలా రుచిగా ఉంటుందని వెల్లడించింది.

sai pallavi habit of eating bibhuthi
సాయి పల్లవి

ఆధ్యాత్మికతపై ఆసక్తి ఎక్కువే
Sai Pallavi Devotion : సాయి పల్లవికి ఆధ్యాత్మికతపై ఆసక్తి ఎక్కువ. ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు కూడా వెళ్లింది. పుట్టపర్తికి తరచూ వస్తూ ఉంటుంది. గత కొత్త సంవత్సరాన్ని అక్కడే జరుపుకొంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. శివకార్తికేయన్​తో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో చాలా రోజుల నుంచి ఆమె సినిమా విడుదల కాలేదు.

sai pallavi habit of eating bibhuthi
సాయి పల్లవి

ఆ పార్ట్​కు సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి.. నిజమేనా?

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ స్టార్​​.. ఆమే నా క్రష్​ అంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.