ETV Bharat / entertainment

ఓటీటీలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నా డబ్బులు చెల్లించాలా?

author img

By

Published : May 15, 2022, 7:31 PM IST

RRR OTT
rrr zee5 cost

RRR OTT Release: ఎన్టీఆర్, రామ్​చరణ్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్​బస్టర్​ 'ఆర్​ఆర్ఆర్' త్వరలోనే జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ మూవీని ఉచితంగా చూడొచ్చా లేదా అందుకు డబ్బులు చెల్లించాలా అనే అంశంపై నెటిజన్లలో సందిగ్ధత నెలకొంది. అయితే జీ5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు కూడా 'ఆర్ఆర్ఆర్​' వచ్చిన వెంటనే చూడాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

RRR OTT Release: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మే 20న జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. మే 19 అర్ధరాత్రి నుంచి జీ5లో ఉచితంగా చూడాలా? లేక అద్దె ప్రాతిపదికన చూడాలా? అన్న దానిపై స్పష్టత లేదు. జీ5 ట్విట్టర్​ అప్‌డేట్స్‌ను బట్టి మొదట కొన్ని రోజుల పాటు అద్దె ప్రాతిపదికన ఈ సినిమాను అందించనున్నట్లు తెలుస్తోంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి జీ5 చేసే ప్రతి ట్వీట్‌లోనూ T-VOD-(ట్రాన్సాక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందని జీ5 చెబుతోంది. అంటే డబ్బులు చెల్లించి చూడాల్సిందేనన్నమాట.

ఇదే విషయమై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు జీ5 సపోర్ట్‌ టీమ్‌ సమాధానం ఇచ్చింది. 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ జీప్లెక్స్‌లో అద్దె ప్రాతిపదికన అందిస్తున్నట్లు తెలిపింది. స్ట్రీమింగ్‌ యాప్‌ వేదికగా ప్రీమియర్‌ మొదలైన తర్వాత మీకు సౌకర్యవంతమైన సమయంలో సినిమాను అద్దెకు తీసుకుని చూడవచ్చని సూచించింది. ఇక కొత్తగా సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాలనుకునే వారి ఎదుట జీ5 రెండు ఆప్షన్లను ఉంచింది. జీ5 12 నెలల ప్లాన్‌ ప్రస్తుతం రూ.599 లభిస్తుండగా, 'ఆర్ఆర్ఆర్' సినిమా చూడాలనుకుంటే అదనంగా రూ.100 చెల్లించి మొత్తం రూ.699 పెట్టి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. ఇలా 'ఆర్ఆర్ఆర్'తో కలిసి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఆ మూవీ వ్యాలిడిటీ 7 రోజుల పాటు ఉంటుంది. ఈ 7 రోజుల్లో ఎప్పుడైనా ఎన్నిసార్లైనా సినిమా చూడవచ్చు. దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం జీ5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు కూడా 'ఆర్ఆర్ఆర్​' వచ్చిన వెంటనే చూడాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఎన్నిరోజులు అమలులో ఉంటుందో తెలియదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విజయ్​ కోసం ముహూర్తం పెట్టిన సమంత.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.