ETV Bharat / entertainment

పులుల్ని వేటాడే పులి.. ఆసక్తిగా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్‌ లుక్‌

మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' కొత్త పోస్టర్​తో పాటు ఓ వీడియో రిలీజైంది. ఇది రవితేజ అభిమానుల ఆకలి తీర్చేలా ఉంది.

author img

By

Published : May 24, 2023, 4:23 PM IST

Updated : May 24, 2023, 4:59 PM IST

ETiger Nageswarrao First look
పులుల్ని వేటాడే పులి.. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్‌ లుక్‌ చూశారా?

స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు'. మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్​ వీడియో రిలీజ్ అయింది. పోస్టర్​ కూడా రిలీజైంది. టైటిల్​కు తగట్టుగానే రవితేజ లుక్​ను పులి మొహం తరహాలో డిజైన్ చేసి విడుదల చేశారు. ఆయన చూపుల్లో కసి, కోపం కనిపిస్తున్నాయి.

5 భాషల్లో పోస్టర్.. రాజమండ్రి రైల్వే వంతెనపై..

రాజమండ్రిలో గ్రాండ్​గా ఫస్ట్ లుక్ గ్లింప్స్​ను విడుదల చేశారు. సుమారు నెల రోజులపాటు శ్రమించి గోదావరి మధ్యలో రాజమండ్రి రైల్వే వంతెనపై ఆవిష్కరించారు. వంతెన మీద వెళ్లే రైలును దొంగలు అడ్డుకుని దోచుకుంటున్నట్లుగా చూపిస్తూ.. పోస్టర్​ను రిలీజ్ చేశారు. రైల్వే, స్థానిక పోలీసుల సహకారంతో దీన్ని అక్కడ ఆవిష్కరించారు. రవితేజ అభిమానుల ఆకలి తీర్చేలా 'టైగర్ నాగేశ్వరరావు'ను తీర్చిదిద్దినట్లు దర్శకుడు వంశీ తెలిపారు. నాగేశ్వరరావు జీవితంలో మరుగున పడిన ఓ వాస్తవాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తెలుగులో విక్టరీ వెంకటేశ్​ వాయిస్ ఓవర్​తో ప్రారంభమైన ఈ గ్లింప్స్​లో.. జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటారు. పులుల్ని వేటాడే పులిని చూశారా ? అంటూ మాస్ మహారాజా రవితేజ చెప్పే హైవోల్టేజ్ డైలాగ్ అదిరిపోయింది. ఇకపోతే ఈ సినిమా పోస్టర్​ను ఐదుగురు పాన్ ఇండియా స్టార్స్ రిలీజ్ చేయడం విశేషం. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ చిత్రం అక్టోబర్ 20న పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా విషయానికొస్తే.. 'టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. 1970-80 ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఐదు ఎకరాల స్థలంలో స్టువర్టుపురం సెట్ వేశారు మేకర్స్. ఇందులో రవితేజ పాత్ర చాలా కొత్తంగా ఉంటుందని ఇప్పటికే రిలీజైన పోస్టర్​ చూస్తుంటే అర్థమవుతోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, కాస్ట్యూమ్స్ కూడా అన్నీ ఢిపరెంట్​గా, సరికొత్తగా ఉండబోతున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. రేణూ దేశాయ్​ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత ఈమె రీఎంట్రీ ఇవ్వడం వల్ల కూడా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి: బన్నీ నెక్స్ట్​ ప్రాజెక్ట్​పై ప్రముఖ నిర్మాత కామెంట్స్​.. ఆ స్టార్ డైరెక్టర్​ ఫిక్స్​!

Last Updated : May 24, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.