ETV Bharat / entertainment

రజనీకాంత్​కు బిగ్ షాక్​- టికెట్లు అమ్ముడుపోక సూపర్​ స్టార్ సినిమా షోలు రద్దు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 10:17 AM IST

Updated : Dec 4, 2023, 11:45 AM IST

Rajinikanth Muthu Movie Rerelease Cancelled : సూపర్ స్టార్ రజనీకాంత్​కు షాక్​ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన నటించిన సూపర్​ హిట్​ సినిమా 'ముత్తు' రీ-రిలీజ్​ షోలు రద్దయ్యాయి. కారణం ఏంటంటే?

Rajinikanth Muthu Movie Rerelease Cancelled
Rajinikanth Muthu Movie Rerelease Cancelled

Rajinikanth Muthu Movie Rerelease In Telugu : తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్​ ఇటీవల 'జైలర్' ​సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో దాదాపు రూ.600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది 'జైలర్'. ఇలాంటి హిట్​ ఇచ్చిన రజనీకాంత్​కు గట్టి షాక్​ తగిలింది. 28 ఏళ్ల క్రితం సూపర్​ హిట్​గా నిలిచిన ఆయన చిత్రం 'ముత్తు' రీ-రిలీజ్ షోలన్నీ తెలుగు రాష్ట్రాల్లో రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ క్లాసిక్​ హిట్​కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. టికెట్లు అమ్ముడుపోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అయితే రీ-రిలీజ్​ సినిమాలకు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు అని అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే టాలీవుడ్​లో గత కొంతకాలంగా రీ-రిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్​ స్టార్ పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో చాలా వరకు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. కొన్నింటిపై ఆసక్తి చూపించక షోలు రద్దయ్యాయి. ఆ జాబితాలోకే ఇప్పుడు ముత్తు చేరింది.

​Muthu Movie Release Date : ఇక 'ముత్తు' సినిమా విషయానికొస్తే 1995లో రిలీజైన ఈ సినిమా తమిళనాడులో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్​గా నిలిచింది. ఆ తర్వాత జపాన్ లోనూ విడుదలై ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాలో రజనీకాంత్​ సరసన మీనా నటించింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న ఆయన మరో సినిమా 'శివాజీ ది బాస్' రీరిలీజ్ కానుంది. అయితే ముత్తు చిత్రానికి ఆదరణ లభించకపోయినా 'శివాజీ'కి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని థియేటర్ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శ్రీలీల, ఇవానా ఒకరికి మించి మరొకరు - వీరి క్యూట్ లుక్స్​కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

''దేవర' సెట్​లోకి వెళితే సొంతింటికి వచ్చినట్లు అనిపిస్తోంది- కారణం అదేనేమో!'

Last Updated : Dec 4, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.