ETV Bharat / entertainment

Siima Awardsలో అఖండ, పుష్ప జోరు

author img

By

Published : Aug 17, 2022, 2:57 PM IST

సైమా వేదికగా తలపడనున్న అగ్ర నటీనటుల చిత్రాల జాబితా బుధవారం విడుదలైంది. తెలుగులోకి వచ్చేసరికి 'పుష్ప' , 'అఖండ', 'ఉప్పెన', 'జాతిరత్నాలు' ఎక్కువ విభాగాల్లో నామినేటైనట్లు ప్రకటించారు. ఇంకా ఏఏ భాషల్లో ఏఏ చిత్రాలంటే..

సైమా అవార్డ్స్​
Sima Awards

Sima Awards దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డుల ప్రదానోత్సవం వచ్చే నెల 10, 11 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో.. సైమా వేదికగా తలపడనున్న అగ్ర నటీనటుల చిత్రాల జాబితా బుధవారం విడుదలైంది. గతేడాది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై నామినేషన్స్‌కు ఎంపికైనా సినిమాలు.. ఎన్ని విభాగాల్లో పోటీ పడనున్నాయో తెలియజేశారు. ఇక, తెలుగులోకి వచ్చేసరికి.. 'పుష్ప' , 'అఖండ', 'ఉప్పెన', 'జాతిరత్నాలు' ఎక్కువ విభాగాల్లో నామినేటైనట్లు ప్రకటించారు. అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' 12 కేటగిరిల్లో అత్యధికంగా నామినేట్‌ కాగా, బాలయ్య నటించిన 'అఖండ' 10 విభాగాల్లో నామినేటై రెండో స్థానంలో ఉంది.

తెలుగు
పుష్ప ది రైజ్‌ (అల్లు అర్జున్) : 12
అఖండ (బాలకృష్ణ) : 10
జాతిరత్నాలు (నవీన్‌ పొలిశెట్టి) : 8
ఉప్పెన (వైష్ణవ్‌ తేజ్‌) : 8

తమిళం
కర్ణన్‌ (ధనుష్‌) : 10
డాక్టర్ (శివ కార్తికేయన్‌) ‌: 9
మాస్టర్‌ (విజయ్‌) : 7
తలైవి (కంగనా రనౌత్‌) : 7

మలయాళం
మిన్నల్‌ మురళీ (టోవినో థామస్‌) : 10
కురుప్ (దుల్కర్‌ సల్మాన్‌) ‌: 8
మాలిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) : 6
జోజీ (ఫహద్‌ ఫాజిల్‌) : 6

కన్నడ
రాబర్ట్‌ (దర్శన్‌) : 10
గరుడ గమన వృషభ వాహన (రాజ్‌ బి.శెట్టి) : 8
యువరత్న (పునీత్‌ రాజ్‌కుమార్‌) : 7

ఇదీ చూడండి: మొన్న క్షమా బిందు, ఇప్పుడు కనిష్క, అక్కడ మరో వింత పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.