ETV Bharat / entertainment

ఈ OTTలోకే ఎన్టీఆర్​ 'దేవర', బాలయ్య 'NBK 109' - పుష్ప 2, సలార్​ కూడా

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 6:12 PM IST

Updated : Jan 15, 2024, 6:32 PM IST

Pushpa 2 OTT Release : ఎన్టీఆర్​ 'దేవర', బాలయ్య 'NBK 109', అల్లు అర్జున్ 'పుష్ప 2', ప్రభాస్​ 'సలార్'​ సినిమా ఓటీటీ రిలీజ్ వివరాల గురించి అప్డేట్​ అఫీషియల్​గా వచ్చింది. ఆ వివరాలు

ఈ ఓటీటీలోకే ఎన్టీఆర్​ 'దేవర', బాలయ్య 'NBK 109' - పుష్ప 2, సలార్​ కూడా
ఈ ఓటీటీలోకే ఎన్టీఆర్​ 'దేవర', బాలయ్య 'NBK 109' - పుష్ప 2, సలార్​ కూడా

Pushpa 2 OTT Release : ప్రస్తుతం సంక్రాంతి బరిలో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్​, నాగార్జున నా సామి రంగ, తేజ సజ్జా(యంగ్ హీరో) హనుమాన్​ - స్టార్‌ హీరో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ జాతర పుర్తవ్వగానే ఆ తర్వాత వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు సందడి చేయబోతున్నాయి. 'పుష్ప 2', 'దేవర', 'కల్కి' వంటి పాన్‌ ఇండియా మూవీస్​ రిలీజ్​కు రెడీగా ఉన్నాయి.

అయితే ఈ సినిమాలకు సంబంధించి ఓటీటీ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. "పుష్ప 2' రూల్‌ చేసేందుకు రాబోతుంది. థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కాబోతుంది" అని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ అనౌన్స్ చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్టర్లను రిలీజ్​ చేసి తెలిపింది. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పింది. సుమారు రూ. 100 కోట్లకు ఈ పుష్ప 2 ఓటీటీ డీల్‌ జరిగినట్టు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

'పుష్ప 2'తో పాటు ఇవి కూడా : పుష్ప 2తో పాటు మరిన్ని అప్‌కమ్మింగ్‌ పాన్‌ ఇండియా, కొత్త సినిమాలపై కూడా నెట్​ఫ్లిక్స్​ అప్‌డేట్‌ ఇచ్చింది. రెబల్ స్టార్​ ప్రభాస్​ 'సలార్‌', యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ 'దేవర', నటసింహం బాలకృష్ణ NBK 109, విశ్వక్​ సేన్​ 'గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి', విజయ్ దేవరకొండ 'VD13', సిద్ధు జొన్నల్లగడ్డ 'డిజే టిల్లు 2', అల్లు శిరీష్‌ 'బడ్డి' వంటి కొత్త సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ తెలిపింది. ఇవన్నీ పోస్ట్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాతే స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సదరు చిత్రాల ఓటీటీ వివరాలపై విడుదలకు ముందే క్లారిటీ వచ్చేసింది. వీటితో పాటు ఇంకా టైటిల్‌ ఖరారు కానీ ఇతర సినిమాల పోస్టర్స్​ను కూడా రిలీజ్​ చేస్తూ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఇక విషయం తెలుసుకుంటున్న అభిమానులు ఈ బడా సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్​ గ్లింప్స్​ - రిలీజ్ డేట్ ఇదే

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

Last Updated :Jan 15, 2024, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.