ETV Bharat / entertainment

లైగర్​ మూవీతో అల్లుఅర్జున్​కు ఉన్న లింక్​ తెలుసా

author img

By

Published : Aug 24, 2022, 5:14 PM IST

liger alluarjun
లైగర్​ అల్లుఅర్జున్​

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ వల్లే 'లైగర్‌' ప్రాజెక్ట్‌ మొదలైందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'లైగర్‌'. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సుకుమార్‌ .. పూరీని సరదాగా కాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివే..

"ఇంటర్వ్యూ చేయాలంటే కాస్త కంగారుగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ‘బద్రి’ తర్వాత నేను మీ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ట్రై చేశా. మా బంధువు సాయంతో మొదటిసారి మిమ్మల్ని కలిశా. ‘కథ ఏమైనా ఉంటే చెప్పు’ అని మీరు అడిగారు. మీతో నా మొదటి మీటింగ్‌ అదే. ఈరోజు మీతో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది"

"మీరు దర్శకత్వం వహించిన ‘ఇడియట్‌’ రిలీజైనప్పుడు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పరిశ్రమలోనే ఉన్నా. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఆ సినిమా చూడటం ఓ మంచి అనుభూతిని అందించింది. ఆ సినిమా రిలీజైనప్పుడు మా ఏడీ బ్యాచ్‌ మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ సినిమాతో ప్రేమలో కొత్త ఫార్ములాని మీరు పరిచయం చేశారు. ప్రతి సీన్‌లో ఓ డైలాగ్‌ రాశారు" అని సుకుమార్​ చిట్​చాట్​ ప్రారంభించగా

పూరీ: ఇడియట్‌ తర్వాత నాకు ఒక కొత్త జీవితం, కెరీర్‌ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. నాకు ఒక్కడికే కాదు మా యూనిట్‌ మొత్తానికి ఆ సినిమాతో మంచి లైఫ్‌ లభించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా తెరకెక్కించే సమయంలో మీరు కంగారు పడతారా?

పూరీ: ఒక సినిమా అనుకున్నప్పుడే నేను పూర్తి క్లారిటీతో ఉంటా. ఆ సినిమాని ఎలా చేయాలి? ఎప్పుడు ఏ సీన్‌ చేయాలి? ఇలా అన్ని విషయాల్లో ఓ క్లారిటీ ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్‌ ఉండదు. ఒకవేళ ఫస్ట్‌డేనే క్లైమాక్స్‌ షూట్‌ చేద్దామన్నా నేను కంగారు పడకుండా చేసేస్తా.

సుకుమార్‌: నేను అలా కాదు సర్‌.. షూట్‌ చేస్తున్నంతసేపు చాలా కంగారు పడుతుంటా. వర్షం పడి షూట్‌ క్యాన్సిల్‌ అయితే పైకి ‘అయ్యో’ అంటాను కానీ లోపల మాత్రం సంతోషిస్తా.
మీ సినిమాలో ఎక్కువగా నైట్‌ షాట్స్‌ ఎందుకు ఉండవు?
పూరీ: రాత్రి షూట్‌ ఉండే సన్నివేశాలను నేను చాలావరకూ రాయను. అలాంటి సన్నివేశాలు రాసినా.. అవసరాన్ని బట్టి వాటిని షూట్‌ సమయంలో తొలగించేస్తా. ఎందుకంటే, రాత్రి షూట్‌ అంటే ప్రొడెక్షన్‌ ఖర్చులు పెరిగిపోతాయని అనుకుంటా. తప్పదు అనుకుంటే ఆ సీన్స్‌ తెరకెక్కిస్తా. లేదంటే సాయంత్రం 6 గంటలకే షూట్‌ పూర్తయ్యేలా చూస్తా. షూట్‌ పూర్తైన వెంటనే పార్టీలో పాల్గొంటా. ఆ తర్వాత రోజు అనుకున్న టైమ్‌కి సెట్‌లోకి వచ్చేస్తా. సెట్‌లోకి అడుగుపెట్టే సమయానికి మైండ్‌ మొత్తం బ్లాంక్‌గా పెట్టుకుంటా. నా ఫస్ట్‌ సినిమాకి మాత్రమే ఫుల్‌ స్క్రిప్ట్‌, డైలాగ్‌ టు డైలాగ్‌ రాసుకున్నా. ఆ తర్వాత ఎప్పుడూ రాయలేదు.

స్క్రిప్ట్‌ వర్క్‌ ఎక్కడ రాస్తారు?
పూరీ: నేను ఎక్కువగా బీచ్‌లో కూర్చొని కథలు రాస్తుంటా. అది కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే. ఒక్కోసారి భోజనానికి కూడా వెళ్లను. ఆరు దాటిన తర్వాత నా మైండ్‌ మొత్తం వేరే ఆలోచనల్లోకి వెళ్లిపోతుంది.
వెంట వెంటనే సినిమాలు చేసే మీరు ‘పోకిరి’కి మాత్రం కాస్త సమయం తీసుకున్నారు కదా..!
పూరీ: నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు. ‘రెండు వారాల్లో కథలు రాయొద్దు. మరో రెండు వారాలకు రాయండి అలా చేస్తే బెటర్‌ సినిమా అవుతుంది’ అని. నువ్వు చెప్పిందే నేను ఫాలో అవుతున్నా. త్వర త్వరగా సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది. చాలా సినిమాలు చేశాం. టైమ్‌ తీసుకుని కథ రాసి, దాన్ని అందరికీ వినిపించి, చేద్దామని ఫిక్స్‌ అయిపోయా.
సుకుమార్‌: ‘లైగర్‌’ తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని చెప్పగలను. ఎందుకంటే, ఈ సినిమాకి మీరు సమయం ఎక్కువగా తీసుకున్నారు. రూ.1000 కోట్లు వసూళ్లు రాబడుతుందని నమ్ముతున్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

‘లైగర్‌’ ఆలోచన ఎలా మొదలైంది?

పూరీ: పదేళ్ల క్రితం ‘ఇద్దరమ్మాయిలతో..’ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ ఒక హాలీవుడ్‌ డైరెక్టర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ దర్శకుడు ఏ సినిమా చేసినా అందులో హీరోకి ఏదో ఒక లోపం ఉండేలా చూపిస్తాడు. అలాంటి పాత్ర మీరు కూడా రాయొచ్చు కదా’’ అని అడిగాడు. నత్తితో ఇబ్బందిపడే హీరో పాత్రపై సినిమా రాస్తే ఎలా ఉంటుందని నేను అడగ్గా.. ‘సూపర్‌ ఉంటుంది. రాయండి’ అని చెప్పాడు. ఈ కథ అలా మొదలైంది. ఈ ఐడియా వచ్చిందే బన్నీ వల్ల.

కథ ఎలా మొదలైంది..?

పూరీ: మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. బన్నీతో మాట్లాడిన తర్వాత నత్తి+ఎంఎంఏతో సినిమా రాశా.

మీ సినిమాల్లో ఎక్కువగా హీరోని అనాథగా చూపిస్తారు. అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సీన్స్‌ కూడా ఎక్కువగా చూపిస్తారు? ఎందుకలా? చిన్నతనంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
పూరీ: నాకు డార్క్‌ చైల్డ్‌వుడ్‌ ఏమీ లేదు. అమ్మానాన్నా చక్కగా పెంచారు. తల్లిదండ్రులు బాగుండి.. వాళ్ల సంరక్షణలో పెరిగిన పిల్లల కంటే.. వాళ్లిద్దరూ లేకుండా జీవితాన్ని సాగిస్తున్న చిన్నారులు ఎక్కువగా బాధలు ఎదుర్కొంటారు. మన పిల్లల కంటే వాళ్లెంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొంటారు. అలాంటి బాధను అనుభవించి పెరిగిన వాళ్లు ఎంతో ధైర్యవంతులని నేను భావిస్తుంటా. అందుకే నా హీరోలను అలా చూపిస్తా.
ఒక్క క్యారెక్టర్‌తోనే సినిమా చేయవచ్చు అని మా జనరేషన్‌ వాళ్లకు ‘ఇడియట్‌’ ద్వారా మీరే తెలియజేశారు. ఆ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ పాత్రని మొదటి నుంచి మంచోడిగా చూపించి.. చివరికి విలన్‌గా చేశారు. ఇలాంటి పాత్ర ఎలా రాశారు..?
పూరీ: ఆ పాత్ర చాలా బాగుంటుంది. ‘బద్రి’ సినిమాలోనూ ప్రకాశ్‌రాజ్‌ విలన్‌గా కనిపిస్తాడు. కానీ చాలా మంచోడు. చెల్లిని సంరక్షించుకోవాలనుకుంటాడు. అలాగే ‘ఇడియట్‌’లోనూ తన కూతురిని ఒక ఇడియట్‌ బారి నుంచి కాపాడుకోవాలని ఆయన కోరుకుంటాడు. అవి రెండూ కొత్త ఆలోచనలే.

ఒకవేళ ఎప్పుడైనా ఆర్టిస్ట్‌లు రావడం ఆలస్యమైతే ఏం చేస్తారు?

పూరీ: ఆర్టిస్ట్‌లు రావడం కాస్త ఆలస్యమవుతుందనుకుంటే వేరే నటీనటులపై క్లోజప్‌ షాట్స్‌ చేసేస్తా. ఒకవేళ ఆ ఆర్టిస్ట్‌ వచ్చే అవకాశం లేనప్పుడు.. కథకు ఇబ్బంది లేకుండా సీన్ మార్చేస్తా. వెంటనే సీన్‌ రాసేసి.. షూట్‌ చేసేస్తా.

‘లైగర్‌’ తర్వాత కూడా మీరు ఇలాగే చేస్తారా?

పూరీ: అక్కడ ఆ సీన్‌ కాకుండా వేరేది పండదు అనుకుంటే.. దాన్ని అలాగే చేస్తా. ‘లైగర్‌’లో రెండు మూడు సీన్స్‌ నటీనటుల్లేకుండానే చేసేశా. ఒకవేళ నేనిప్పుడు ఆసీన్స్‌ ఏమిటో చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. ఏది ఏమైనా ఇక నుంచి నేను కూడా ఓపికగా స్క్రిప్ట్‌ వర్క్‌ చేసి.. వివరణాత్మకంగా సినిమా చేయాలనుకుంటున్నా.

సినిమా విషయంలో ఎవరైనా సలహాలిస్తే తీసుకుంటారా?

పూరీ: సినిమా విషయంలో నటీనటులు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ ఇలా ఎవరు మంచి విషయం చెప్పినా నేను తీసుకుంటా. కథ మంచిగా సాగడమే కదా మనకి కావాల్సింది.

ఒక డైరెక్టర్‌కు మద్యపానం, పొగాకు ఎంతవరకూ అవసరం?

పూరీ: ఏ మాత్రం అవసరం లేదు. చిన్నప్పుడు తిరిగిన తిరుగుళ్ల వల్ల అలవాటు అవుతాయి. చిన్నప్పుడే నాకు సిగరెట్లు కాల్చడం అలవాటు అయ్యింది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉండేవారికి షుగర్‌, స్వీట్స్‌ ఎక్కువగా తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. కొంతమంది మద్యం, పొగాకు అలవాటు పడతారు. నేను సిగరెట్లు ఎక్కువగా కాలుస్తా.

పూరీ: మీరు వర్క్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది?
సుకుమార్‌: నాకెక్కువగా స్వీట్స్‌ తినాలనిపిస్తుంది.

కెరీర్‌ ఆరంభంలో మీరు మీ గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఇంగ్లీష్‌ నవలలు ఇచ్చి చదవమనేవారట. వాటి సారాంశాన్ని అడిగి తెలుసుకునే వారటగా?
పూరీ: అవన్నీ అబద్ధాలు. ఎలాంటి నిజం లేదు. నేనే ఇంగ్లీష్‌ పుస్తకాలు చదివేవాడిని. అలా, చదివిన వాటిల్లో ఏదైనా అమ్మాయిలకు ఉపయోగపడుతుందనిపిస్తే.. వాటి కాపీలు కొన్నింటిని నా దగ్గర దాచి పెట్టుకుని.. నేను కలిసిన కొంతమంది అమ్మాయిలకు వాటిని బహుమతిగా ఇస్తా.
మీ సినిమాల్లో హీరోకి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది.. అలాంటి పాత్రలు రాయడానికి మీకు స్ఫూర్తి ఏమిటి?
పూరీ: నాకు స్ట్రాంగ్‌ క్యారెక్టరైజేషన్‌ రాయడమంటే ఇష్టం. నా సినిమాల్లో హీరోకు ఎలాంటి కన్ఫ్యూజన్‌ ఉండకూడదనుకుంటా. మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’తో నాకు అది అలవాటైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్‌తో నత్తిగా మాట్లాడించడం ఎలా ఉంది?

పూరీ: నత్తి అనేది కాస్త రిస్కే. ఎందుకంటే, ఇంతకు ముందులా భారీగా డైలాగ్స్‌ రాయలేను. చెప్పించలేను. దానివల్ల నాకు కాళ్లు చేతులు కట్టేసినట్లే. విజయ్‌ పర్ఫార్మెన్స్‌ చాలా బాగుంది. రమ్య కృష్ణకు కథ చెప్పిన తర్వాత.. ‘కథ బాగుంది. విజయ్‌ నత్తిగా ఎలా చేస్తాడో చూస్తా. అతను బాగా చేస్తే సినిమా సూపర్‌ హిట్టే’ అని చెప్పింది. విజయ్‌పై ఫస్ట్‌ షాట్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆమె కెమెరా వెనుక నిల్చొని సీన్‌ చూసింది. సీన్‌ పూర్తి కాగానే చప్పట్లు కొట్టింది.

మైక్‌టైసన్‌ని ఎలా తీసుకున్నారు?
పూరీ: మైక్‌ టైసన్‌ లాంటి వ్యక్తితో ఈ రోల్‌ చేయిస్తే బాగుంటుందనిపించింది. ఆ తర్వాత ఆయనతో చేయవచ్చు కదా అనుకున్నా. ఇదే విషయాన్ని ఛార్మికి చెప్పా. ఆమె సుమారు ఒక ఏడాది పాటు కష్టపడి ఒప్పించింది. మైక్‌ టైసన్‌ వచ్చి షూట్‌కి కూర్చొనే వరకూ మాపై మాకే నమ్మకం లేదు. టైసన్‌ వచ్చాడా? చేస్తున్నాడా? అనిపించింది. ఎంతో సరదాగా ఉంటాడు. ఆయనతో వర్క్‌ చేయడం చాలా బాగుంది. సినిమా షూట్‌ అప్పుడు.. ‘నా భర్త ఫైటర్‌.. యాక్టర్‌ కాదు’ అని మైక్‌ టైసన్‌ భార్య మాతో చెప్పింది.
ఇండియాలో ఉన్న గొప్ప రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గారు. ఆయన ఫోన్‌లో స్క్రీన్‌ సేవర్‌గా మీ ఫొటోనే పెట్టుకున్నారు..!
పూరీ: అవును. ఆయన నన్నెంతో ఇష్టపడుతుంటారు. పైకి శత్రువునని చెబుతుంటారు కానీ అది అబద్ధం. రాజమౌళి నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మేమిద్దరం ఇంకా సినీ పరిశ్రమలోకి రానప్పుడు.. కృష్ణవంశీ ఓసారి చెన్నైలో రాజమౌళిని పరిచయం చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ గారు పెద్ద రచయిత అని మాత్రమే నాకు తెలుసు. రాజమౌళి నాకు పరిచయమయ్యాక.. ‘‘గురూ.. మీ ఫాదర్‌ని ఒక్కసారి చూడాలని ఉంది’’ అని అడిగా. తర్వాత ఓ సారి రాజమౌళి నన్ను వాళ్లింటికి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్‌ గారు.. ఓ కుర్చీలో కూర్చొని ఏదో చదువుకుంటున్నారు. ఆయన కుర్చీ వెనుక సినిమా షీల్డ్స్‌, అవార్డులు, ఫొటోలున్నాయి. ‘‘పరిచయం చేయనా?’’ అని రాజమౌళి అడిగాడు. ‘‘వద్దులే బాగోదు’’ అని చెప్పి వచ్చేశా.

ఇదీ చూడండి: ఇకపై నేనే సూపర్ స్టార్, షారుక్ అభిప్రాయం తప్పు, రౌడీ హీరో పవర్ పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.