ETV Bharat / entertainment

'చంద్రముఖి' కానున్న 'చందమామ'.. ప్రారంభం కానున్న ప్రభాస్ కొత్త చిత్రం!

author img

By

Published : Oct 14, 2022, 6:49 PM IST

prabhas and kajal aggarawal upcoming projects
prabhas and kajal aggarawal

వరుస షూటింగ్​లతో బిజీగా ఉంటున్న పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్..​ మరో కొత్త ప్రాజెక్ట్​లోకి ఎంటర్​ అవ్వనున్నాడట. ఎప్పుడు సీరియస్​గా ఉండే డార్లింగ్​ ఈ సారి నవ్వులు పూయించేందుకు మన ముందుకు వస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న కాజల్​ ఇప్పుడు చంద్రముఖిలా మారబోతోంది.

కాజల్​ అగర్వాల్​.. తెలుగులో ఓ వెలుగు వెలిగిన అగ్ర కథానాయికల్లో ఒకరు. ఈ పంజాబీ ముద్దుగుమ్మ సౌత్​లో భారీగానే అభిమానుల్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటించి తనదైన ముద్రవేసుకుంది. అగ్రకథానాయకులందరితోనూ స్క్రీన్​ షేర్​ చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్​ కిచ్లును వివాహం చేసుకుంది. వివాహానంతరం కొంత కాలం సినిమాలకు బ్రేక్​ ఇచ్చింది. నెలల కిందటే ఓ మగ శిశువుకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోట్​ అయ్యింది. ఇప్పటికి వన్నె తరగని అందంతో 'చందమామ'లా ఉన్న కాజల్​.. బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులకే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

'ఇండియన్‌ 2' కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన ఆమె చేతికి మరో సినిమా కూడా అందినట్టు సమాచారం. 'చంద్రముఖి 2' కోసం ఆమె సంతకం చేసినట్టు తెలిస్తోంది. 'చందమామ' కాస్త 'చంద్రముఖి' అవుతోందన్నమాట. లారెన్స్‌ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ షురూ అయ్యింది. మళ్లీ కెమెరా ముందుకు అడుగుపెట్టడం వల్ల కాజల్‌ కొన్నాళ్లుగా తన లుక్‌పై దృష్టి సారించింది. ఇటీవల 'భారతీయుడు 2' కోసం తీవ్రంగా వర్కౌట్లు చేసింది.

నవ్వులు పూయించనున్న ప్రభాస్​: 'ఆదిపురుష్' టీజర్​తో కాస్త ఉపశమనం పొందిన ప్రేక్షకులకు ప్రభాస్ మరో అప్డేట్​ ఇచ్చారు. 'ఆదిపురుష్',​'సలార్' లాంటి సీరియస్​ రోల్స్​తో తెరకెక్కుతున్న చిత్రాలతో బిజీగా ఉంటున్న ఈ రెబల్ స్టార్.. సరికొత్త ప్రాజెక్ట్​లోకి అడుగుపెట్టనున్నారని సినీ వర్గాల సమాచారం. 'ప్రేమ కథా చిత్రం','మహానుభావుడు','భలే భలే మగాడివోయ్'​ లాంటీ కామెడీ ఎంటర్​టైనర్​లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మారుతి దర్శకత్వంలో ప్రభాస్​ నటించనున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో నిధి అగర్వాల్​తో పాటు మాళవిక మోహనన్ సైతం నటిస్తున్నట్లు సమాచారం.

కమర్షియల్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్​ అక్టోబర్​ 7 న ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఎప్పుడూ సీరియస్​ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే డార్లింగ్..​ ఇప్పుడు తనలోని కామెడీ యాంగిల్​​ను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్​ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం అది కూడా ఓ తాత పాత్రలో. ఇన్ని సర్ప్రైజ్​లున్న ఈ చిత్రం మొదలవుతోందని ప్రభాస్​ ఫ్యాన్స్​ వేచి చూస్తున్నారు. అయితే విషయాలను చిత్ర యూనిట్​ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. 'ఆదిపురుష్'​ విడుదల అనంతరం వెల్లడిస్తారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: డేటింగ్​లో​ సారా.. శుభ్​మన్​ జంట! మరోసారి కెమెరాకు.. నెట్టింట వీడియో వైరల్​

రష్మి రెమ్యునరేషన్​పై హైపర్​ ఆది కామెంట్స్​.. ఆమె అంత తీసుకుంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.