ETV Bharat / entertainment

Salaar Prabhas : ఇంటర్నేషనల్​ మాఫియాతో ప్రభాస్​​ బిగ్​ ఫైట్​.. ఫ్యాన్స్​కు పూనకాలే!

author img

By

Published : Aug 2, 2023, 8:32 AM IST

Salaar Prabhas Fight Scene
Salaar Prabhas Fight Scene

Salaar Prabhas Fight Scene : సలార్​ మూవీలో పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ ఫ్యాన్స్​కు పెద్ద సర్​ప్రైజ్​ ఉందట. ఈ మూవీలో ఇంటర్నేషనల్​ మాఫియా గ్యాంగ్​తో డార్లింగ్​ బిగ్​ ఫైట్​ చేయనున్నారట.

Salaar Prabhas Fight Scene : పాన్ఇండియా స్టార్​ ప్రభాస్‌ లీడ్​ రోల్​లో.. స్టార్​ డైరెక్టర్​ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్​' పార్ట్​-1. ఇటీవలే ఈ యాక్షన్‌ థ్రిలర్​కు సంబంధించిన చిత్ర యూనిట్​.. 'ది మోస్ట్​ వైలెంట్​ మెన్.. ​ కాల్డ్​ వన్​ మెన్..​ ది మోస్ట్​ వైలెంట్​' పేరుతో విడుదల చేసిన టీజర్​.. సోషల్​మీడియాలో సంచలనం సృష్టించింది.

Salaar Teaser : "సింపుల్ ఇంగ్లీష్‌.. నో క‌న్ఫ్యూజ‌న్‌... లయన్​, చీతా, టైగ‌ర్‌, ఎలిఫెంట్ వెరీ డేంజ‌ర‌స్‌.. బ‌ట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్‌. బికాజ్ ఇన్ ద‌ట్ పార్క్.. దేర్ ఈజ్ ఏ..(సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో...) అంటూ సీనియర్ నటుడు టీనూ ఆనంద్‌ డైలాగ్‌తో టీజర్​ ఓ రేంజ్​లో ఉందని చెప్పొచ్చు. అయితే ఆ సమయంలో టీనూ చుట్టూ ఇంటర్నేషనల్​ మాఫియా గ్యాంగ్​ ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Salaar Prabhas Fight : అయితే ఆ గ్యాంగ్​తోనే ప్రభాస్​ భీకర ఫైట్​ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నేరస్థులతో డీల్​ చేయనున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు. మూవీ బ్లాక్​ బస్టర్​ హిట్​ కావడం పక్కా అని అంటున్నారు. యాక్షన్​ సీన్స్​తో ప్రభాస్​ దుమ్ముదులుపుతాడని చర్చించుకుంటున్నారు. దీని బట్టి చూస్తుంటే ప్రశాంత్​ నీల్​ పెద్ద స్కెచ్​ వేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో ఎన్నో హైలైట్లు ఉండబోతున్నాయని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పింది.

Salaar Cast : 'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్​', 'ఆదిపురుష్​' వంటి మూడు సినిమాలు ప్రభాస్ అభిమానులకు నిరాశ మిగిల్చాయి. కమర్షియల్​గా బాక్సాఫీస్​ ముందు వసూళ్ల మోత మోగించినా.. అవి పాజిటివ్​ మౌత్ టాక్​ను దక్కించుకోలేకపోయాయి. దీంతో ​ఫ్యాన్స్ అంతా 'సలార్' సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఆమె ఆద్య అనే జర్నలిస్ట్​గా కనిపించనుందట. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సీనియర్ నటుడు జగపతి బాబు ప్రతినాయకులుగా కనిపిస్తున్నారు. ఇక శ్రియారెడ్డితో పాటు మరికొంతమంది ఇతర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.